Tekkali TDP : టెక్కలిలో అచ్చన్నకు ఎర్త్ ?

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా టెక్కలి నియోజకవర్గం... రాజకీయంగా చాలా కీలకం. ఇక్కడ నుంచి టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గాన్ని పార్టీకి... కుటుంబానికి కంచుకోటగా కింజరాపు కుటుంబం మార్చుకుంది. కానీ భవిష్యత్‌లో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గడ్డు రోజులు ఎదుర్కొక తప్పదని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 30, 2024 | 09:20 AMLast Updated on: Jan 30, 2024 | 9:20 AM

Atchannaku Earth In Tekkali

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని శ్రీకాకుళం (Srikakulam) జిల్లా టెక్కలి నియోజకవర్గం… రాజకీయంగా చాలా కీలకం. ఇక్కడ నుంచి టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. టెక్కలి నియోజకవర్గాన్ని పార్టీకి… కుటుంబానికి కంచుకోటగా కింజరాపు కుటుంబం మార్చుకుంది. కానీ భవిష్యత్‌లో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గడ్డు రోజులు ఎదుర్కొక తప్పదని సొంత పార్టీ నేతలే హెచ్చరిస్తున్నారట. మరోవైపు వైసీపీ అధిష్టానం పక్కా లెక్కలు, ఈక్వేషన్స్ తో రెడీ అయింది. అచ్చెన్నాయుడును ఓడించేందుకు అస్ర్తశస్ర్తాలు సిద్దం చేస్తోంది. సర్వశక్తులు ఒడ్డయినా సరే… ఏపీ టీడీపీ అధ్యక్షుడిని (AP TDP President) శాసనసభకు వెళ్లకుండా… వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు వైసీపీ నేతలు. కింజరాపు కుటుంబంలో ఎర్రన్న తర్వాత వినిపించే ప్రముఖ పేరు అచ్చెన్నాయుడు.

గత ప్రభుత్వంలోనూ… పార్టీలోనూ కీలక స్థానం‌ కట్టబెట్టింది తెలుగుదేశం. యువకుడైన ఎంపీ రామ్మోహన్ నాయుడుని మించి పార్టీలో అచ్చన్నకు ప్రాధాన్యత ఇచ్చింది. కారణాలేవైనా అచ్చెన్నాయుడుని… ప్రస్తుతం లోకేష్ (Lokesh) టీం అంతగా పట్టించుకోవడంలేదట. పార్టీలో అంతర్గతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆయన ఓటమికి…అధికార పార్టీ పక్కా స్కెచ్ గీసిందట. గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో కూడా టెక్కలి నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు సునాయాసంగా విజయం సాధించారు. దీంతో టీడీపీ నేతల్లో అచ్చెన్నాయుడిని గట్టిగా టార్గెట్ చేసింది వైసిపి అధిష్టానం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు ఓడించేందుకు… వైసీపీ నేతలు ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేశారట.

కచ్చితంగా టెక్కలిలో అచ్చెన్న సీటు చింపేయాలని భావిస్తోందట. అచ్చెన్నాయుడు గెలుపునకు ప్రధాన కారణం వర్గ విభేదాలే అన్న సత్యాన్ని గుర్తించింది వైసీపీ నాయకత్వం. అందుకే ఎప్పుడూ కలవని కళింగ సామాజిక వర్గం మొత్తాన్ని… ఇప్పుడు ఏకతాటి పైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. టెక్కలి నియోజకవర్గానికే చెందిక కీలక నేతలకు పదవులు కట్టబెట్టింది. జిల్లాలో ఒక ఎంపి, మూడు ఎమ్మెల్యే సీట్లు ఆఫర్ చేసింది. నియోజకవర్గంలో ఉన్న ముగ్గురు కళింగ నేతలను కలిసిపోయేలా ఎత్తులు సిద్ధం చేస్తోంది. టెక్కలి ఇంచార్జ్‌గా ‌ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను ప్రకటించిన అధిష్టానం… మరో ‌కీలక నేత పేరాడ తిలక్‌ను ఎంపీ అభ్యర్దిగా ప్రకటించింది.

గతంలో మూడు ముక్కలాటగా మారిన‌ నేతలను ఒకతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. మరో కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణికి (Killi Kriparani) ప్రాధాన్యత కలిగిన పదవిలో కూర్చోబెట్టనుందట. కీలక నేతలకు పార్టీలో, ప్రభుత్వంలో పదవులు, నియోజకవర్గం అభివృద్ది అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం‌ చేస్తోంది వైసీపీ. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలకు సామాజిక సమీకరణాలు తోడైతే… విజయం సాధిస్తామనే ఆలోచనలో ఉందట వైసీపీ. ఐక్యతారాగం వినిపిస్తున్న వైసీపీ నుంచి అచ్చెన్నకి ఈ సారి గెలుపు అంత ఈజీ కాదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.