Gudapally Narasiah : టీడీపీ నేత ఇంటిపై దాడి.. గూడవల్లి నర్సయ్య కార్లను ధ్వంసం చేసిన దుండగులు
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ప్రసాదంపాడులో టీడీపీ నాయకులు, వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఉపసర్పంచ్ గూడవల్లి నరసయ్య ఇంటిపై గుర్తితెలియని వ్యక్తులు దాడి చేశారు. నిన్న ప్రసాదంపాడులో గన్నవరం టీడీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన విసృత స్థాయి సమావేశం జరిగింది.

Attack on TDP leader's house.
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా ప్రసాదంపాడులో టీడీపీ నాయకులు, వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఉపసర్పంచ్ గూడవల్లి నరసయ్య ఇంటిపై గుర్తితెలియని వ్యక్తులు దాడి చేశారు. నిన్న ప్రసాదంపాడులో గన్నవరం టీడీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన విసృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన నాయకులు భారీగా హాజరయ్యారు. సమావేశంలో ప్రసాదంపాడు టీడీపీ ఉపసర్పంచ్ గూడవల్లి నరసయ్య కీలకంగా వ్యవహరించారు.
దీంతో నరసయ్య ఇంటి ఆవరణలోకి అర్ధరాత్రి ప్రవేశించిన దుండగులు గూడవల్లి నరసయ్య కార్లు ధ్వంసం చేశారు. నరసయ్య ఇంటిపై దాడి పిరికిచర్య అని పార్టీ బాధ్యుడు యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. టీడీపీ పెరిగిన ప్రజాధరణ చూసి ఓర్వలేక ఇటువంటి దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. దాడిని వ్యతిరేకిస్తు నరసయ్య ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.