YS JAGAN: జగన్‌పై దాడి.. ప్రచారంలో మార్పు చేస్తారా.. జగన్‌కు జనం దూరమేనా..?

జగన్ ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నాడు. ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మధ్యలో సభల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలా వ్యవహరించాలో సూచించింది ఇంటెలిజెన్స్ విభాగం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2024 | 05:32 PMLast Updated on: Apr 14, 2024 | 5:32 PM

Attack On Ys Jagan Intelligence Beuro Key Suggetions

YS JAGAN: ఏపీ సీఎం జగన్‌పై విజయవాడలో జరిగిన దాడి ఘటన సంచలనం కలిగిస్తోంది. ముఖ్యంగా జగన్ భద్రత విషయంలో అధికారుల్లోనూ, అభిమానుల్లోనూ సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత భద్రతాధికారులు, నిఘా విభాగంపై ఉంది. దాడి ఘటనతో అప్రమత్తమైన ఇంటెలిజెన్స్ విభాగం కీలక సూచనలు చేసింది. జగన్ భద్రత విషయంలో అధికారులకు కీలక ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది.

Salman Khan: సల్మాన్ హత్యకు మరోసారి యత్నం.. ఇంటివద్ద కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పనేనా..?

జగన్ ప్రస్తుతం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహిస్తున్నాడు. ఏపీలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మధ్యలో సభల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎలా వ్యవహరించాలో సూచించింది ఇంటెలిజెన్స్ విభాగం. దీని ప్రకారం.. జగన్ బస్సుకు వంద మీటర్ల దూరంలోనే జనం ఉండేలా చూడాలి. మరీ అవసరమైతేనే జగన్ బస్సు వద్దకు నేతలు, కార్యకర్తలకు అనుమతి ఇవ్వాలి. జగన్‌కు, జనంకు మధ్య గతంలో మాదిరిగా బారికేడ్లు ఏర్పాటు చేయాలి. క్రేన్ల ఆర్చిలు, గజమాలలను కూడా తగ్గించాలి. సభల్లో ర్యాంప్ వాక్‌లు చేయొద్దు. అలాగే వీలైనంత వరకు బస్సులోనే ఉండాలి. జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యాలు లేకుండా చూసుకోవాలి. అయితే, ఈ సూచనలు పాటించడం వల్ల జగన్‌, జనానికి మధ్య దూరం పెరుగుతుంది. దీనివల్ల ప్రజలు జగన్‌ను దగ్గరగా చూసే అవకాశం లేదు. దీనివల్ల జగన్‌.. జనానికి దూరమయ్యే అవకాశం ఉంటుంది.

మరి.. ఈ విషయంలో జగన్ భద్రతా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఎన్నికల సమయం కాబట్టి.. ప్రజలకు దగ్గరగా ఉండటం ఏ నాయకుడికైనా అవసరమే. అందుకే జగన్ కూడా ఈ అంశంలో ఎలా స్పందిస్తారు.. ఇప్పటిలాగా జనంతో మమేకమవుతారా అనే ఆసక్తి నెలకొంది. శుక్రవారం జరిగిన దాడి ఘటనలో జగన్ ఎడమ కంటి పైభాగంలో గాయమైన సంగతి తెలిసిందే.