YS JAGAN: జగన్‌ను చంపాలనుకున్నారు! జగన్ కేసు నిందితుడి విచారణలో సంచలనాలు..

సతీష్‌ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్టు గుర్తించారు. నిందితుడి కాల్‌ డేటా, సీసీ ఫుటేజ్‌ ఆధారంగా సతీష్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడి విచారణ తరువాత రిలీజ్‌ చేసిన రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2024 | 07:11 PMLast Updated on: Apr 18, 2024 | 7:11 PM

Attack On Ys Jagan Key Details Revealed In Interrogation

YS JAGAN: సీఎం జగన్‌ మీద జరిగిన దాడి ఏపీ రాజకీయాల్లో క్రియేట్‌ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ దాడి చేయించింది టీడీపీ నేతలే అని వైసీపీ.. కాదు సింపతీ కోసమే వైసీపీ డ్రామాలాడుతోందని టీడీపీ నేతలు ఆరోపణల యుద్ధం చేశారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. ఎట్టకేలకు జగన్‌ మీద దాడి చేసిన నిందితున్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. సతీష్‌ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్టు గుర్తించారు. నిందితుడి కాల్‌ డేటా, సీసీ ఫుటేజ్‌ ఆధారంగా సతీష్‌ను అరెస్ట్‌ చేశారు. నిందితుడి విచారణ తరువాత రిలీజ్‌ చేసిన రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక విషయాలు వెల్లడించారు పోలీసులు.

PUSHPA 2: పుష్ప 2 వరుస సర్‌ప్రైజ్‌లు.. త్వరలో టీజర్.. ఆ వెంటనే పాటలు..

సతీష్‌ ఉద్దేశపూర్వకంగానే జగన్‌ను చంపాలనే ఈ దాడి చేసినట్టు నిర్ధారించారు. ఇందుకోసం కార్యకర్తల్లో ఒకడిగా కలిసిపోయి దాడి చేసినట్టు సతీష్‌ ఒప్పుకున్నాడని చెప్పారు. సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ దగ్గర నుంచి ఓ రాయి తీసుకువచ్చి డాబా కోట్ల సెంటర్‌ వద్ద జగన్‌ మీద దాడి చేసేందుకు ప్రయత్నించాడట సతీష్‌. కానీ అక్కడ పోలీసులు ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడట. తరువాత జగన్‌ యాత్ర వివేకానంద స్కూల్‌ దగ్గరికి చేరుకోవడం, అక్కడ లైట్స్‌ కూడా లేకపోవడంతో అక్కడ దాడి చేశాడట. 100 మీటర్ల దూరం నుంచి ఓ బెంచ్‌ పక్కన దాక్కుని దాడి చేశాడట. దాడి చేసిన వెంటనే అక్కడ ఉన్న కొందరు కార్యకర్తలు సతీష్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించినా.. వాళ్ల నుంచి తప్పించుకుని పారిపోయాడట. ఇదంతా దుర్గారావు అనే వ్యక్తి చెప్తేనే చేశానని చెప్పాడట సతీష్‌. ఇక్కడ హైలెట్‌ పాయింట్‌ ఏంటి అంటే.. ఈ కేసులో ఏ2 గా ఉన్న దుర్గారావు టీడీపీ బీసీ సెల్‌ కార్యదర్శి. దుర్గారావు డబ్బులిస్తానంటేనే సతీష్‌ దాడి చేశాడని రిమాండ్‌ రిపోర్ట్‌లో చెప్పారు పోలీసులు.

దాడి తరువాత సతీష్‌.. దుర్గారావుకు ఫోన్‌ చేశాడని.. మొదట ఫోన్‌ కట్‌ చేసిన దుర్గారావు తరువాత ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసుకున్నాడని చెప్పారు. దుర్గారావు ఫోన్‌ ఆఫ్‌ అవ్వడంతో అక్కడి నుంచి నేరుగా ఇంటికి వెళ్లిపోయాడట సతీష్‌. ఇక.. సతీష్‌ వెళ్లిన రూట్‌లో సీసీ కెమెరా ఫుటేజ్‌, కాల్‌ డేటా ఆధారంగా సతీష్‌ను రాజేశ్వరిపేటలో అరెస్ట్‌ చేశారు పోలీసులు. సతీస్‌ గతంలో కూడా ఓ సెల్‌ఫోన్‌ దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. ఓవరాల్‌గా ఈ దాడి వ్యవహారం అటు తిరిగీ ఇటు తిరిగీ టీడీపీకి లింక్‌ అవ్వడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సింపతీ కోసం జగన్‌ డ్రామాలు ఆడుతున్నాడంటూ చెప్తున్న టీడీపీ నేతలు ఈ రిమాండ్‌ రిపోర్ట్‌ను ఎలా డిఫెండ్ చేస్తారో చూడాలి.