ATTACK ON YS JAGAN: జగన్‌పై దాడి కేసులో నిందితులు వీళ్లే ! పోలీసు విచారణలో సంచలనాలు..

జగన్‌పై దాడి చేసిన వ్యక్తి అజిత్ సింగ్ నగర్.. వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. అతని పేరు సతీష్ అని.. జేబులో రాయి తీసుకొచ్చి దాడి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సతీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కీలక ప్రశ్నలకు సమాధానం లాగుతున్నారని తెలుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 16, 2024 | 05:11 PMLast Updated on: Apr 16, 2024 | 5:11 PM

Attack On Ys Jagan Police Arrested Culprits

ATTACK ON YS JAGAN: సీఎం జగన్‌పై రాళ్ల దాడి ఘటన తర్వాత.. ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాయి చుట్టే రాజకీయం తిరుగుతోందిప్పుడు. దాడి అంతా డ్రామా అని టీడీపీ ఆరోపణలు చేస్తుంటే.. వచ్చి కొట్టించుకోండి అప్పుడు తెలుస్తుంది అంటూ వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య.. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు.

Lokesh Kanagaraj: కొత్త యాంగిల్.. రాఘవ లారెన్స్‌తో లోకేష్ కనగరాజ్..

జగన్‌పై దాడి చేసిన వ్యక్తి అజిత్ సింగ్ నగర్.. వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. అతని పేరు సతీష్ అని.. జేబులో రాయి తీసుకొచ్చి దాడి చేసినట్టు ప్రచారం జరుగుతోంది. సతీష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కీలక ప్రశ్నలకు సమాధానం లాగుతున్నారని తెలుస్తోంది. సతీష్‌తో పాటు అతని నలుగురు స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. సెల్ ఫోన్ డేటాతో పాటు ఇతర కీలక ఆధారాల ద్వారా నిందితుడిని పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఘటనకు సంబంధించి మొత్తం ఐదుగురు యువకుల ప్రమేయం ఉందని తెలుస్తోంది.మరికొన్ని గంటల్లో సతీష్ కుమార్ కు సంబంధించిన ఫోటోలు సైతం విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది.జగన్ అభిమానులు తీసిన వీడియోల ద్వారా నిందితులను గుర్తించారని తెలుస్తోంది.

నిందితుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత పోలీసులు వివరాలు చెప్పే చాన్స్ ఉంది. ప్రస్తుతం గోప్యంగా విచారణ జరుగుతోంది. ఫుట్ పాత్ పై పార్కింగ్ టైల్స్ లో వాడే రాయితో.. ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారమే ఈ ఘటన జరిగిందని.. 20అడుగుల దూరం నుంచి జగన్ పై ఈ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడి ఘటన వెనుక ఎవరైనా ఉన్నారో లేదో తెలియాల్సి ఉంది.