YS JAGAN-SRI REDDY: నేను చనిపోతా.. శ్రీ రెడ్డి ఎమోషనల్ పోస్ట్
ఈ దాడి చేయించింది టీడీపీనే అని వైసీపీ నేతలు అంటుంటే.. కాదు.. కాదు.. సింపతీ కోసం వాళ్లే చేయించుకున్నారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మినీసైజ్ మాటల యుద్ధం జరుగుతోంది.

YS JAGAN-SRI REDDY: వైసీపీ అధినేత జగన్ మీద జరిగిన దాడి ఏపీ రాజకీయాలను షేక్ చేసింది. విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తులు జగన్‌ను రాయితో కొట్టడంతో ఆయన ఎడమ కనుబొమ్మకు తీవ్ర గాయమైంది. వెంటనే హాస్పిటల్‌కు తరలించడంతో డాక్టర్లు జగన్‌కు 3 కుట్లు కూడా వేశారు. ఈ దాడి చేయించింది టీడీపీనే అని వైసీపీ నేతలు అంటుంటే.. కాదు.. కాదు.. సింపతీ కోసం వాళ్లే చేయించుకున్నారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
YS JAGAN: జగన్‌పై దాడి.. ప్రచారంలో మార్పు చేస్తారా.. జగన్‌కు జనం దూరమేనా..?
ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మినీసైజ్ మాటల యుద్ధం జరుగుతోంది. ఇలా జగన్ మీద దాడి జరిగిన విషయం తెలిసి ఆయన అభిమానులు అల్లాడిపోతున్నారు. తమ నాయకుడిపై దాడి చేసింది ఎవరూ అంటూ రగిలిపోతున్నారు. దాడి విషయం మీడియాలో ప్రసారం ఐన గంట నుంచే ఆయన అభిమానుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిన్న పిల్లలు కూడా మా మామయ్యకు దెబ్బతగిలింది అంటూ ఏడుస్తున్నారు. ఇదే క్రమంలో జగన్ వీరాభిమాని శ్రీ రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. జగనన్నా నేను ఇంక బతకను. నిన్ను ఇలా చూడలేకపోతున్నా. మీరంటే నాకు పిచ్చి, ప్రాణం. మీపై దాడి జరిగిందని తెలిసి రాత్రంతా నిద్ర కూడా పోలేదు అంటూ పోస్ట్ చేసింది.
జగన్ కోసం అల్లాడిపోతున్న శ్రీరెడ్డిని చూసి ఆమె ఫ్యాన్స్ అల్లాడిపోతున్నారు. ఊరుకో రెడ్డీ ఆయనకేం కాదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక యాంటీ జగన్ శ్రీరెడ్డి ఫ్యాన్స్ గురించి తెలిసిందేగా.. ఎప్పటిలాగే నెగటివ్ కామెంట్స్‌తో ఆడుకుటుంన్నారు. ఈ కామెంట్లు ఎలా ఉన్నా.. జగన్‌కు చిన్న దెబ్బ తగిలితేనే చనిపోతా అంటోంది అంటే.. శ్రీరెడ్డికి జగన్ అంటే పిచ్చి గట్టిగానే ఉంది అంటున్నారు మ్యూచువల్ ఫ్యాన్స్.