YS JAGAN: ఎటాక్‌ని వాడేసుకుంటున్నారు.. ఎన్నికల వేళ ఎవరి గోల వారిదే..!

జగన్ పై ఎటాక్ జరగడం అనేది దురదృష్టకరం.. విమర్శలు, ప్రతి విమర్శల వరకూ ఓకే.. కానీ ఈ సంఘటనను వైసీపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. ఎన్నికల వేళ ఈ సంఘటనను వాడుకోడానికి ట్రై చేస్తోంది. టీడీపీ, జనసేన, ఇతర కూటమి నేతలపై ఆరోపణలు చేస్తూ.. తమకు మైలేజ్ వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 14, 2024 | 03:32 PMLast Updated on: Apr 14, 2024 | 3:32 PM

Attack On Ys Jagan Ysrcp Using This Incident

YS JAGAN: ఏపీ సీఎం జగన్ పై జరిగిన దాడి సంఘటనను ఆ రాష్ట్రంలో పార్టీలు తమ ఇష్టానికి వాడేసుకుంటున్నాయి. అధికార పార్టీ.. ప్రతిపక్షాల మీద ఎటాక్ చేస్తే.. ప్రతిపక్ష పార్టీలేమో జగన్నాటకం అంటూ రెస్పాండ్ అవుతున్నాయి. జగన్ పై దాడి ఎవరు చేశారు.. ఎవరు చేయించారు అన్నది పక్కనబెడితే.. ఎన్నికల వేళ పార్టీల మధ్య డైలాగ్ వార్ మాత్రం తారా స్థాయి చేరింది. జగన్ పై దాడి జరిగిన వెంటనే .. అది చేయించింది చంద్రబాబే అంటూ వైసీపీ నేతలు ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఈమధ్య సభల్లో జగన్ ని రాళ్ళు పెట్టి కొట్టమని బాబు పిలుపు ఇచ్చాడనీ.. అందుకే దాడి జరిగిందని అంటున్నారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఫిజికల్ ఎటాక్స్ చేస్తున్నారని మరికొందరు లీడర్లు మాట్లాడారు.

BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టో విడుదల.. మూడు కోట్ల ఇండ్ల నిర్మాణానికి హామీ

జగన్ పై ఎటాక్ జరగడం అనేది దురదృష్టకరం.. విమర్శలు, ప్రతి విమర్శల వరకూ ఓకే.. కానీ ఈ సంఘటనను వైసీపీ అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. ఎన్నికల వేళ ఈ సంఘటనను వాడుకోడానికి ట్రై చేస్తోంది. టీడీపీ, జనసేన, ఇతర కూటమి నేతలపై ఆరోపణలు చేస్తూ.. తమకు మైలేజ్ వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అసలు దాడికి కారకులు ఎవరన్నదానిపై పోలీసులు 20 మంది సిబ్బందితో ఎంక్వైరీ చేయిస్తున్నారు. కానీ దాడి జరిగిన వెంటనే టీడీపీ, జనసేన నేతలు రెస్పాండ్ అయిన తీరుపై మాత్రం విమర్శలు వచ్చాయి. ఎటాక్ అయిన కొద్దిసేపటికి టీడీపీ నేత నారా లోకేష్ .. పార్టీ అధికారిక సోషల్ మీడియాలో భిన్నంగా స్పందించారు. వైసీపీ కావాలనే చేస్తోందంటూ పోస్టింగ్స్ పెట్టారు. ఇవి బూమ్ రాంగ్ అయ్యాయి. 2019లో జరిగి కోడి కత్తి సంఘటన లాగా మళ్ళీ జరిగిందని కామెంట్ చేశారు టీడీపీ నేతలు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ నేతలు సోషల్ మీడియాల్లో.. ఇది కావాలనే వైసీపీ నేతలే చేయించుకున్నారనీ.. తగిలింది గులకరాయే కదా అని కూడా కామెంట్ చేశారు. అయితే అటు జాతీయ మీడియాలోనూ ఈ సంఘటనపై వార్తలు రావడం, ఆ తర్వాత ప్రధాని మోడీతోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నేతలు కూడా స్పందించారు. దాంతో టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించక తప్పలేదు. దాడిని ఖండిస్తూ ట్వీట్ చేశారు.

కానీ అప్పటికే లోకేష్, అచ్చన్నాయుడు చేసిన పోస్టులు వైరల్ అయ్యాయి. ఇక జనసేన నేత నాగబాబు ఫస్ట్ ట్వీట్ కూడా వివాదస్పదమైంది. చాలా పకడ్బందీగా ప్లాన్ చేశావ్ మైక్.. అస్సలు స్క్రిప్ట్ లాగా అనిపించట్లేదు.. అని మెస్సేజ్ పెట్టారు. ఆ తర్వాత దాన్ని తీసేసి.. జగన్‌పై దాడిని ఖండించారు నాగబాబు. ఇక లోకేష్ ట్వీట్ పై డైరక్టర్ ఆర్జీవీ ఏసుకున్నారు. లోకేష్ కి బ్రెయిన్ తో పాటు హృదయం కూడా లేదంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో టీడీపీ, జనసేన సెల్ఫ్ గోల్ చేసుకున్నాయన్న విమర్శలు వచ్చాయి. కానీ జగన్ పై అసలు ఎటాక్ ఎవరు చేశారు.. ఇందులో ఏదైనా రాజకీయ పార్టీ ప్రమేయం ఉందా లేదా అన్నది తేలాలి. ఎన్నికల కమిషన్ కూడా పోలీసులతో నిస్పాక్షికంగా ఎంక్వైరీ చేయిస్తేనే బెటర్ అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.