మెగా వేలంపై ఆసీస్ స్పిన్నర్ ప్రశ్న, తెలివిగా ఆన్సర్ ఇచ్చిన పంత్
ఐపీఎల్ వేలానికి ఇంకా కొన్ని గంటలే మిగిలుంది. అటు ఫ్రాంచైజీలు, ఇటు ఫ్యాన్స్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలోనూ వేలంలో చాలా ఆసక్తి ఉంటుంది. తాజాగా భారత్,ఆసీస్ టెస్ట్ మ్యాచ్ లో వేలం గురించి ఓ ఘటన చోటు చేసుకుంది.
ఐపీఎల్ వేలానికి ఇంకా కొన్ని గంటలే మిగిలుంది. అటు ఫ్రాంచైజీలు, ఇటు ఫ్యాన్స్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెటర్లలోనూ వేలంలో చాలా ఆసక్తి ఉంటుంది. తాజాగా భారత్,ఆసీస్ టెస్ట్ మ్యాచ్ లో వేలం గురించి ఓ ఘటన చోటు చేసుకుంది. క్రీజులో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తుండగా.. ఫీల్డ్ పేస్‌మెంట్ ఛేంజ్‌లో భాగంగా ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్ ఓ వైపు నుంచి మరో వైపుకు వెళుతూ పంత్‌తో మాట్లాడాడు. వేలంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం అని లియోన్ పంత్‌ను అడిగాడు. దీనికి పంత్ నో ఐడియా అంటూ సమాధానం ఇచ్చారు. వీరిద్దరి సంభాషణ స్టంప్ మైక్‌లో రికార్డైంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.