ఆసీస్ కు గాయాల బెడద, ఫేవరెట్ గా టీమిండియా

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఘనవిజయంతో ఆరంభించిన టీమిండియా ఆ జోష్ లో పింక్ బాల్ టెస్టుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ లో మనపై ఒత్తిడి ఎక్కువగానే ఉన్నప్పటకీ కొన్ని అంశాలు మాత్రం అడ్వాంటేజ్ గా మారుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2024 | 11:55 AMLast Updated on: Dec 05, 2024 | 11:55 AM

Aussies Are Plagued By Injuries Team India Is The Favorite

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఘనవిజయంతో ఆరంభించిన టీమిండియా ఆ జోష్ లో పింక్ బాల్ టెస్టుకు రెడీ అవుతోంది. ఈ మ్యాచ్ లో మనపై ఒత్తిడి ఎక్కువగానే ఉన్నప్పటకీ కొన్ని అంశాలు మాత్రం అడ్వాంటేజ్ గా మారుతున్నాయి. ఆసీస్ ను వరుస గాయాలు వెంటాడుతుండడంతో భారత్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.ఈ పర్యటనకు ముందు ఆసీస్ కు భారత్ కనీసం పోటీ అయినా ఇస్తుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ తర్వాత ఒక్కసారిగా టీమిండియాలో జోష్ పెరిగింది. పింక్ బాల్ టెస్టుల్లో ఆసీస్ కు తిరుగులేని రికార్డుంది. కంగారూలు 12 డే నైట్ టెస్టుల్లో ఇప్పటివరకు ఒక్కటి మాత్రమే ఓడిపోయారు. మరోవైపు చివరిసారి ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ లో భారత్ 36 పరుగులకే ఆలౌటైంది.

ఆస్ట్రేలియాకు రికార్డ్స్ అనుకూలంగా ఉన్నప్పటికీ భారత్ ను ఓడించడం కష్టంగానే కనిపిస్తుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టు ఓటమి తర్వాత ఆతిధ్య జట్టు తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే రెండో టెస్టులో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు వెళ్లాలంటే కూడా ఆసీస్ కు ఈ మ్యాచ్ గెలుపు అత్యంత కీలకంగా మారింది. అయితే వరుస గాయాలు ఆసీస్ కు మైనస్ గా మారాయి. ఈ మ్యాచ్ లో ఆసీస్ స్టార్ బౌలర్ జోష్ హేజల్ వుడ్ ఆడడం లేదు. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ కు ప్రాక్టీస్ లో గాయమైంది. మ్యాచ్ సమయానికి అతను అందుబాటులో ఉండడం అనుమానంగా మారింది. ఒకవేళ స్మిత్ దూరమైతే బ్యాటింగ్ భారమంతా ఖవాజా, హెడ్ మీదే పడనుంది.

మరోవైపు తొలి టెస్టులో గెలిచిన తర్వాత టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఒకరకంగా చూసుకుంటే రెండో టెస్టుకు మరింత బలంగా కనిపిస్తుంది. తొలి టెస్టుకు దూరమైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాడు శుభమాన్ గిల్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండడం ఖాయమైంది. ప్రాక్టీస్ మ్యాచ్ లో అందరూ టచ్ లోకి వచ్చారు. బుమ్రా, కోహ్లీ టాప్ ఫామ్ ను కొనసాగిస్తే భారత్ 2-0 ఆదిక్యలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది