కెప్టెన్ ను మార్చబోతోన్న ఆసీస్, స్మిత్ చేతికే జట్టు పగ్గాలు

పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి 10 ఏళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 7, 2025 | 08:24 PMLast Updated on: Jan 07, 2025 | 8:24 PM

Aussies To Change Captain Smith To Take Charge Of Team

పాట్ కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి 10 ఏళ్ల తర్వాత బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ విజయం తర్వాత ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీలో మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. మళ్లీ స్టీవ్ స్మిత్ టెస్టు జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

సిడ్నీ టెస్టు విజయంతో ఆస్ట్రేలియా ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇప్పుడు ఆసీస్ శ్రీలంకతో తదుపరి టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌కి కమిన్స్ దూరం కానున్నాడు. తన కుటుంబ సభ్యులతో సమయం కేటాయించేందుకు కమిన్స్ క్రికెట్ ఆస్ట్రేలియాను కోరాడట. నివేదిక ప్రకారం కమిన్స్ తన భార్య రెండవ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పాట్ కమిన్స్ శ్రీలంక సిరీస్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. దానికి ఆస్ట్రేలియా కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్ మరోసారి ఆస్ట్రేలియా పగ్గాలు చేపట్టనున్నాడు. 2018 మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన కెప్‌టౌన్ టెస్టు సందర్భంగా స్మిత్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. దాంతో అతడి కెప్టెన్సీ కూడా ఊడింది. ఈ ఘటన క్రికెట్ ఆస్ట్రేలియా చరిత్రలోనే పెద్ద మచ్చగా మిగిలిపోయింది.

టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి ఆస్ట్రేలియా సిడ్నీ టెస్టుతో పాటు శ్రీలంకతో ఆడిన రెండు టెస్టు మ్యాచ్‌లలో ఒకదానిలో విజయం సాధించాల్సి ఉంది. భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరినందున శ్రీలంకతో జరిగే సిరీస్‌ కీలకంగా మారింది.ఫైనల్లో దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనుంది. ఇక భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ పెద్దగా రాణించలేదు. దీంతో సెలెక్టర్లు శ్రీలంకపై బ్యాటింగ్ ఆర్డర్‌పై ప్రయోగాలు చేయవచ్చు, తద్వారా దక్షిణాఫ్రికాతో టైటిల్ మ్యాచ్‌కు జట్టు పూర్తిగా సన్నద్ధమవుతోంది.