జురెల్ ఉండగా రాహుల్ దండగ, ఆసీస్ మాజీ కెప్టెన్ కామెంట్స్

భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక సిరీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇంకా కొద్దిరోజులే టైముంది. ఇప్పటికే కంగారూ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా సీక్రేట్ ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతోంది. అటు ఆసీస్ టీమ్ సైతం నెట్స్ లో చెమటోడ్చుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2024 | 07:30 PMLast Updated on: Nov 14, 2024 | 7:30 PM

Australia Ex Cricketer Prefer Kl Rahul

భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక సిరీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇంకా కొద్దిరోజులే టైముంది. ఇప్పటికే కంగారూ గడ్డపై అడుగుపెట్టిన టీమిండియా సీక్రేట్ ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతోంది. అటు ఆసీస్ టీమ్ సైతం నెట్స్ లో చెమటోడ్చుతోంది. ఈ సిరీస్ కోసమే పాక్ తో వన్డేలకు సీనియర్ ప్లేయర్స్ ను పక్కన పెట్టిన ఆసీస్ భారత్ ను ఓడించి సిరీస్ గెలుస్తామన్న కాన్ఫిడెంట్ తో ఉంది. ఈ నేపథ్యంలో భారత్, ఆసీస్ సిరీస్ పై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ టీమిండియా మేనేజ్ మెంట్ కు కీలక వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టులో యువ ఆటగాడు ధ్రువ్ జురెల్‌ని ఆడించాలని సూచించాడు. అతను అద్భుతమైన టాలెంట్ ఉన్న కుర్రాడని కితాబిచ్చాడు. వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టగలడని వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతని బ్యాటింగ్ కు ఫిదా అయ్యానంటూ ప్రశంసించాడు.

ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియాకి అతను కీ ప్లేయర్ అవుతాడని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. అతనికి ఇంకా 23 ఏళ్లే అయినా తన టీమ్‌లో అందరికంటే క్లాస్ బ్యాటింగ్ చూపించాడని మెచ్చుకున్నాడు. పేస్ బౌలింగ్‌ని, బౌన్సర్లను చక్కగా ఎదుర్కొన్నాడన్నాడు. భారత ప్లేయర్లు బౌన్సర్లను ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడతారనీ, ధ్రువ్ మాత్రం ఎంతో సులువుగా, ఎంతో అనుభవం ఉన్నవాడిలా బ్యాటింగ్ చేశాడంటూ ఆకాశానికెత్తేశాడు. కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హజల్‌‌వుడ్ బౌలింగ్‌లో ధ్రువ్ బ్యాటింగ్ చూడడానికి ఎదురుచూస్తున్నానంటూ టిమ్ పైన్ కామెంట్ చేశాడు. అయితే తుది జట్టులోకి జురెల్ రావడం కష్టంగానే కనిపిస్తోంది.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌కి ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్‌‌, నితీశ్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్‌తో పాటు కెఎల్ రాహుల్ కూడా ఆసీస్ ఏ జట్టుతో అనధికార టెస్టులు ఆడాడు. కెఎల్ రాహుల్, రెండు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిల్ అయ్యాడు. రెండు టెస్టులు ఆడిన అభిమన్యు ఈశ్వరన్ నిరాశపరిచాడు. రెండు టెస్టుల్లోనూ నిలకడగా రాణించింది ధ్రువ్ జురెల్ మాత్రమే. అయితే రిషబ్ పంత్ ఉండడంతో ధ్రువ్ జురెల్‌కి అవకాశం రావడం కష్టం. ఇప్పటికే కోచ్ గౌతమ్ గంభీర్ కూడా దీనిపై హింట్ ఇచ్చాడు. రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరమవుతుండడంతో జైశ్వాల్ తో కలిసి రాహుల్, అభిమన్యు ఈ శ్వరన్ లో ఒకరు ఓపెనింగ్ చేస్తారని చెప్పాడు. కాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22 నుంచి మొదలు కానుండగా… టీమిండియా 4-0తో సిరీస్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు నేరుగా క్వాలిఫై అవుతుంది.