నయా కింగ్ జైశ్వాల్, ఆసీస్ మీడియా ప్రశంసలు
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎప్పుడు జరిగినా ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్ళు లేదా ఆసీస్ మీడియా మాటలతో రెచ్చగొడుతూ ఓవరాక్షన్ చేస్తుంటారు. కానీ ఈ సారి ఆసీస్ మీడియా దీనికి భిన్నంగా ప్రవర్తిస్తోంది. తమ ఆటగాళ్ళను సైతం పక్కన పెట్టి భారత స్టార్ క్రికెటర్లపై స్పెషల్ కవరేజీ చేస్తోంది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎప్పుడు జరిగినా ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్ళు లేదా ఆసీస్ మీడియా మాటలతో రెచ్చగొడుతూ ఓవరాక్షన్ చేస్తుంటారు. కానీ ఈ సారి ఆసీస్ మీడియా దీనికి భిన్నంగా ప్రవర్తిస్తోంది. తమ ఆటగాళ్ళను సైతం పక్కన పెట్టి భారత స్టార్ క్రికెటర్లపై స్పెషల్ కవరేజీ చేస్తోంది. విరాట్ కోహ్లీ ఫోటోతో కవర్ పేజీ స్టోరీ రాసిన అక్కడి మీడియా మరో ప్లేయర్ పైనా ప్రశంసలు కురిపించింది. ఆ ప్లేయర్ ఎవరో కాదు యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్… నయా కింగ్ అంటూ స్పెషల్ ఆర్టికల్స్ ప్రచురించింది. కోహ్లీకి రీప్లేస్ మెంట్ గా వరల్డ్ క్రికెట్ లో జైశ్వాల్ పేరును ప్రస్తావిస్తూ అక్కడి మీడియా రాసిన కథనాలు వైరల్ గా మారాయి. టెస్ట్ క్రికెట్ లో జైశ్వాల్ అరంగేట్రం నుంచీ అదరగొడుతున్నాడంటూ బ్యానర్ కథనాలు రాసాయి. నిజానికి ఈ సిరీస్ లో జైశ్వాల్, పంత్ లపైనే ఆసీస్ జట్టు ఫోకస్ పెట్టింది. పంత్ గత పర్యటనలో కంగారూలకు చుక్కలు చూపించాడు.
గబ్బా వేదికగా చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి రెండోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందించాడు. అందుకే పంత్ ను కట్టడి చేయకుంటే కష్టమని ముందే పసిగట్టిన ఆసీస్ టీమ్ స్పెషల్ ప్లాన్స్ సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు జైశ్వాల్ ను ప్రశంసిస్తూ ఆసీస్ మీడియా రాసిన కథనాలు సోషల్ మీడియాలో అభిమానులు వైరల్ చేస్తున్నారు. గతేడాది వెస్టిండీస్ పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఈ ముంబై బ్యాటర్..ఆరు నెలల్లోనే తన టెస్ట్ కెరీర్ లో 1000 పరుగుల మైలురాయిని పూర్తి చేసుకున్నాడు. డెబ్యూ టెస్టులోనే భారీ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిచ్చర పిడుగు తన ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. కేవలం 16 ఇన్నింగ్స్ ల్లోనే 1000 పరుగుల మార్క్ చేరుకున్నాడు. దీంతో వేగంగా 1000 పరుగులు చేసిన రెండో భారతీయుడిగా నిలిచాడు.
అలాగే యశస్వి జైస్వాల్ అరంగ్రేటం చేసిన ఏడాదిలోనే మరో అరుదైన ఘనత సాధించాడు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో1000కి పైగా పరుగులు చేసిన మూడో భారతీయుడిగా.. ప్రపంచంలో ఏడవ ఆటగాడిగా నిలిచాడు. జూలై 2023లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ ఓపెనర్.. పూణే టెస్టులో ఈ ఘనత సాధించాడు. తద్వారా లెజెండరీ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్, సునీల్ గవాస్కర్ సరసన చేరాడు. ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ జైశ్వాల్ చెలరేగేందుకు ఎదురుచూస్తున్నాడు.