ఆస్ట్రేలియాకు షాక్, గాయంతో స్టార్ పేసర్ ఔట్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో చిత్తుగా ఓడిన కంగారూలకు మరో షాక్ తగిలింది. రెండో టెస్టుకు ముందు కీలక బౌలర్ ఆ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో జట్టు నుంచి తప్పుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 30, 2024 | 08:55 PMLast Updated on: Nov 30, 2024 | 8:55 PM

Australia Suffers Shock As Star Pacer Ruled Out With Injury

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో చిత్తుగా ఓడిన కంగారూలకు మరో షాక్ తగిలింది. రెండో టెస్టుకు ముందు కీలక బౌలర్ ఆ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ రెండో జట్టు నుంచి తప్పుకున్నాడు. పక్కటెముకల గాయంతో ఇబ్బంది పడుతున్న హేజిల్‌వుడ్ సిరీస్‌లోని మిగిలిన టెస్టులకు అందుబాటులో ఉండటం కూడా అనుమానంగా మారింది .హ్యాజిల్ వుడ్ తొలి టెస్టులో 5 వికెట్లు తీశాడు. రెండో టెస్టు‌కు జరిగే అడిలైడ్‌లోనూ ఈ కుడిచేతి వాటం పేసర్‌కు మంచి రికార్డు ఉంది. అడిలైడ్ వేదికగా భారత్‌తో ఆడిన గత మ్యాచ్‌లో హేజిల్‌వుడ్ 5 ఓవర్లలో 8 పరుగులే ఇచ్చి అయిదు వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగులకే ఆలౌటైంది. హేజిల్‌వుడ్ స్థానంలో అన్‌క్యాపడ్ పేసర్లు సీన్ అబాట్, బ్రెండన్ డెగాట్ ఎంపికయ్యారు. కాగా, హేజిల్‌వుడ్ స్థానంలో స్కాట్ బొలాండ్ తుదిజట్టులోకి వచ్చే ఛాన్సుంది.