ఆస్ట్రేలియాకు షాక్ వరల్డ్ కప్ ఫైనల్లో సౌతాఫ్రికా
మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా దిమ్మతిరిగే షాకిచ్చింది. అజేయ జట్టుగా ఉన్న కంగారూలను సెమీస్ లో చిత్తుగా ఓడించింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది.

మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా దిమ్మతిరిగే షాకిచ్చింది. అజేయ జట్టుగా ఉన్న కంగారూలను సెమీస్ లో చిత్తుగా ఓడించింది. సెమీస్‌లో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో చారిత్రక విజయాన్ని అందుకుంది. టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికాకు ఇదే తొలి విజయం. మరోవైపు మహిళల టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఫైనల్ చేరకపోవడం ఇదే ప్రథమం. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 134 పరుగులు చేసింది. తర్వాత దక్షిణాఫ్రికా 17.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ అందుకుంది. ఈ విజయంతో సఫారీలు వరుసగా రెండోసారి ఫైనల్లో అడుగుపెట్టారు. మరో సెమీస్ లో విండీస్ తో కివీస్ తలపడబోతోంది.