ఎవడ్రా నువ్వు..! బుమ్రాకే చుక్కలు చూపించాడు

ఆస్ట్రేలియా జట్టుకు భవిష్యత్తు టెస్ట్ బ్యాట్స్‌మెన్ దొరికాడు. మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం ఆటగాడు సామ్ కాన్స్టాస్ బ్యాట్‌తో చేసిన అద్భుత ఫీట్‌ని అందరూ కొనియాడుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 26, 2024 | 06:05 PMLast Updated on: Dec 26, 2024 | 6:05 PM

Australiya Young Batsmen Aggressive Batting

ఆస్ట్రేలియా జట్టుకు భవిష్యత్తు టెస్ట్ బ్యాట్స్‌మెన్ దొరికాడు. మెల్‌బోర్న్ వేదికగా భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో అరంగేట్రం ఆటగాడు సామ్ కాన్స్టాస్ బ్యాట్‌తో చేసిన అద్భుత ఫీట్‌ని అందరూ కొనియాడుతున్నారు. మెల్‌బోర్న్ టెస్ట్‌లో కెప్టెన్ పాట్ కమిన్స్ ఇచ్చిన అవకాశాన్ని శామ్ కాన్స్టాస్‌ అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆరంభం నుంచే సామ్ కాన్స్టాస్ భీకరమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఉస్మాన్‌తో కలిసి ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టిన ఈ 19 ఏళ్ళ కుర్రాడు వరల్డ్క్లాస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాని సైతం ధీటుగా ఎదుర్కొన్నాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే బుమ్రాకు చుక్కలు చూపించాడు. 2021 నుంచి టెస్టుల్లో ఒక్క సిక్స్ కూడా ఇవ్వని బుమ్రా, సామ్ కాన్స్టాస్ దాన్ని బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో బుమ్రా ఓవర్లో సామ్ రివర్స్ స్వీప్ షాట్ ఆడాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ సామ్ బ్యాటింగ్ విధానాన్ని కొనియాడుతున్నారు. బుమ్రా బౌలింగ్ లో ఆ షాట్ ని ఆడటం అంత ఈజీ కాదని అంటున్నారు. బుమ్రా వేసిన 7వ ఓవర్ మొదటి రెండు బంతుల్లో సామ్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. నిజానికి ఆ ఓవర్ రెండో బంతికే సామ్ కాన్‌స్టాన్స్ చరిత్ర సృష్టించాడు. 2021 తర్వాత బుమ్రా బౌలింగ్ లో తొలిసారి సిక్సర్ కొట్టిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. బుమ్రాపై కెమెరాన్ గ్రీన్ చివరిసారిగా సిక్సర్ కొట్టాడు. అదే సమయంలో జోస్ బట్లర్ తర్వాత టెస్టులో జస్సీ బౌలింగ్ లో రెండు సిక్సర్లు బాదిన రెండో బ్యాట్స్‌మెన్‌గా కాన్స్టాస్ నిలిచాడు. 2018లో జోస్ బట్లర్ బుమ్రా బౌలింగ్ లో 2 సిక్సర్లు బాదాడు.

అరంగేట్రం టెస్ట్ మ్యాచ్‌లో సామ్ కాన్స్టాస్‌ను ఔట్ చేయడంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కష్టపడాల్సి వచ్చింది. అయితే రవీంద్ర జడేజా అతనిని అవుట్ చేసి భారత్‌కు మంచి ఆరంభాన్ని అందించాడు. జడేజా బౌలింగ్ లో సామ్ ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.ఈ సమయంలో సామ్ 60 పరుగులు చేశాడు. కాగా 19 సంవత్సరాల 85 రోజుల వయస్సులో అతను టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నాల్గవ అతి పిన్న వయస్కుడైన ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు.