మరోసారి తండ్రయిన హెడ్ SRH హిట్టర్ హ్యాపీమూమెంట్
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు ట్రావిడ్ హెడ్ మరోసారి తండ్రయ్యాడు. అతడి భార్య జెస్సికా పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు ట్రావిడ్ హెడ్ మరోసారి తండ్రయ్యాడు. అతడి భార్య జెస్సికా పండింటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా గుడ్ న్యూస్ ను జెస్సికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. తన భర్త హెడ్, కుమార్తె మీలా, కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను జెస్సికా షేర్ చేసింది.హెడ్-జెస్సికా జోడీ తమ కుమారుడికి హారిసన్ జార్జ్ అని నామకరణం చేశారు. వెల్కమ్ టూ వరల్డ్ హారిసన్ జార్జ్ హెడ్ అంటూ ఆమె క్యాప్షన్‌గా రాసుకొచ్చింది. ఇక గత కొంతకాలంగా రెస్ట్ లేకుండా క్రికెట్ ఆడుతున్న హెడ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతడు తిరిగి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీతో మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఐపీఎల్ 17వ సీజన్ లో సన్‌రైజర్స్ కు ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ లతో అదరగొట్టాడు. దీంతో హెడ్ ను మరోసారి సన్ రైజర్స్ రిటైన్ చేసుకుంది.