Avinash Reddy: అవినాశ్‌ విచారణలో సీబీఐకి ఇన్ని కష్టాలా.. లోపం సంస్థలోనా.. చట్టాల్లోనా ?

సీబీఐ.. దేశంలోని అత్యున్నత సంస్థల్లో ఒకటి. కేసు ఏదైనా.. నేరం ఎలాంటిదైనా.. రాష్ట్రం పరిధి దాటి సీబీఐ చేతుల్లోకి వెళ్లిందంటే.. అతి తక్కువ సమయంలో అంతు చూస్తారనే పేరు ఉంది. ఐతే ఇదంతా ఒకప్పుడు ! సీబీఐ రోజురోజుకు అభాసుపాలవుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు.. సీబీఐని రాజకీయం కోసం వాడుకుంటున్నాయని.. సీబీఐని రాజకీయాలు కమ్మేశాయని.. పంజరంలో చిలకలా సీబీఐ మారిందనే విమర్శలు ఉన్నాయ్.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 23, 2023 | 07:45 PMLast Updated on: May 23, 2023 | 7:45 PM

Avinash Reddy Cbi Investigation

సీబీఐ విచారణ అంటే సాగతీత ధోరణి తప్ప.. తేలేదేమీ లేదన్న అభిప్రాయానికి దాదాపుగా వచ్చేశారు జనాలు. ఇలాంటి సమయంలో వివేకా కేసులో పరిణామాలు.. సీబీఐ పరువును మరింత దిగజార్చుతున్నాయ్. అరెస్ట్ అయినా.. అంతకుమించి పరిణామం అయినా.. సీబీఐ అనుకుంటే చిటికెలో జరిగిపోతుందనే టాక్ ఉంది. వివేకా కేసులో మాత్రం పూర్తి తేడాగా ఉంది వ్యవహారం. అధికారులు నోటీసులివ్వడం.. అదే సమయంలో అవినాశ్‌ను ఏదో ఒక సమస్య వెంటాడడం.. ఆయన లేఖ రాయడం.. వీళ్లు మళ్లీ నోటీసులు ఇవ్వడం.. ఇదే జరుగుతోంది ప్రతీసారి ! ప్లీజ్‌ ఒక్కసారి వచ్చి విచారణకు హాజరు అవొచ్చుగా అని సీబీఐ బతిమిలాడుకుంటుందేమో అన్నట్లుగా తయారయింది పరిస్థితి.

నిజానికి దేశంలో ఏ కేసులోనూ నిందితుడిగి ఇన్ని ఛాన్స్‌లు ఇచ్చిన పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఈ కేసులోనే ఎందుకు ఇలా జరుగుతోంది. అవినాశ్‌కు ఇన్ని అవకాశాలు ఎందుకు ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. లోపం సీబీఐలోనా.. చట్టాల్లోనా.. ఎందుకీ సాగతీత అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయ్. సీబీఐ చేతికి కేసు చిక్కితే.. పరిష్కారం లభిస్తుంది.. న్యాయం దొరుకుతుందనే టాక్ ఉంది. ఐతే ఇదే పరిస్థితి కొనసాగితే.. సీబీఐ మీద నమ్మకం పోయే ప్రమాదం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇలాంటివి చూసినప్పుడే.. కేంద్రం చేతిలో సీబీఐ కీలుబొమ్మలా మారిందా అనే అనుమానాలు రాకుండా ఉండదు.

సీబీఐకి స్వయం ప్రతిపత్తి ఉంది. ఏది అనుకుంటే అది.. ఎలా అనుకుంటే అది చేసే హక్కులు ఉంటాయ్. కానీ అలా జరగగడం లేదు. ఎందుకు అంటే.. మితిమీరిన రాజకీయ జోక్యమే కారణమే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. దీంతో చట్టం కొందరికి చుట్టంగా మారుతుందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్. పరపతి ఉన్నోడికి ఒకలా.. లేనోడికి ఒకలా న్యాయం అన్నట్లుగా పరిస్థితి తయారయింది. ఇలాంటి కేసులో.. ఇదేస్థానంలో అవినాశ్ కాకుండా ఇంకెవరైనా ఉంటే.. వాళ్లకు కూడా సీబీఐ ఇలాంటి అవకాశాలు ఇస్తుందా.. ఇలానే ట్రీట్‌ చేస్తుందా అంటే… అవకాశమే లేదు. ఇప్పుడు వివేకా కేసులో.. అవినాశ్ వ్యవహారంలో సీబీఐ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకపోతే.. సంస్థ పరువు మరింత దిగజారే ప్రమాదం లేకపోలేదు మరి !