Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా 1000 ట్రైన్లు
అయోధ్య ఈ పేరు తెలియని వారు భహుసా ఉండరేమో.. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య నగరంలో శ్రీరాముడికి రామమందిరం కడుతున్న విషయం తెలిసిందే.. కాగా ఈ రామ మందిరానికి వచ్చే భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని ప్రధాన నగరాల నుంచి ప్రత్యేకం 1000 రైళ్లను అయోధ్యకు నడపనున్నట్లు భారత రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు.

Ayodhya Ram Mandir

కాగా జనవరి 33న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 19 నుంచి ఈ రైళ్లు నడపనున్నట్లు సమాచారం. శ్రీరాముడి విగ్రమ ప్రతిష్టపన మహోత్సవం ఉండనుంది. రోజుకి 50 వేల మంది ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేశారు. జనవరి 15నాటికి ఇది పూర్తిగా అందుబాటులోకి రానుంది. అయోధ్య ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ సహా అగ్రనేతలు తరలిరానున్నారు. దేశ వ్యాప్తంగా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె, కోల్ కతా, నాగ్ పుర్, జమ్మూతో సహా దేశంలోని ప్రధాన నగరాల నుంచి ఇవి నడవనున్నాయి. అయోధ్యలోని స్టేషన్ ని కూడా పునరుద్ధరించారు.