Ayodhya Ram Mandir: అయోధ్యకు రాముడొచ్చాడు.. ఐదేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా..
బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరింది. రాముడి విగ్రహం ఊరేగింపుగా విచ్చేసింది. ఐదేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా కనిపిస్తున్నారు. పసితనం, అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడేలా విగ్రహం కనిపిస్తోంది.
Ayodhya Ram Mandir: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జనవరి 22న అయోధ్యలోని రామమందిరంలో రామ్‌లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది వీఐపీలు పాల్గొననున్నారు. ఇప్పటికే రామ్‌లల్లా విగ్రహాన్ని ఆయోధ్యకు తీసుకొచ్చారు. బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరింది. రాముడి విగ్రహం ఊరేగింపుగా విచ్చేసింది. ఐదేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా కనిపిస్తున్నారు.
SINGER CHITRA: అయోధ్యపై సింగర్ చిత్ర పోస్ట్.. సోషల్ మీడియాలో వివాదం..
పసితనం, అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడేలా విగ్రహం కనిపిస్తోంది. బాలరాముడి విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేశారు మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్. 17న ఆలయ పరిసరాల్లోకి బాలరాముడు రాగా.. 18న మండప ప్రవేశ పూజ నిర్వహిస్తారు. వాస్తు పూజ, వరుణ పూజ, గణేశ్ పూజ చేస్తారు. దీంతో అధికారిక ఆచారాలు ప్రారంభం అవుతాయ్. 19న ఆలయ ప్రాంగణంలో అగ్నిని వెలగిస్తారు. ఆ తర్వాత నవగ్రహ, యజ్ఞ గుండాన్ని ఏర్పాటు చేస్తారు. 20న ఫల దివస్ నిర్వహిస్తారు. ఆరోజు రామ జన్మభూమి ఆలయ గర్భగుడిని.. సరయూ నది నీటితో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత వాస్తు శాంతి, అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తారు. 21న పుష్పా దివస్ చేపడతారు. యజ్ఞం చేసిన తర్వాత ప్రత్యేక పూజలతో రామ్‌లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానోత్సవం, అభిషేకం నిర్వహిస్తారు.
22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒంటి గంట వరకు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. జనవరి 21, 22 తేదీలలో భక్తులను ఆలయంలోకి అనుమతించరు. జనవరి 23వ తేదీన ఆలయం తెరుస్తారు. ఇక అటు 100కి పైగా చార్టెడ్ విమానాల్లో అతిథులు అయోధ్యకు చేరుకుంటారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. అందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.