AYODHYA RAM MANDIR: రాముడు ఎందుకు మహనీయుడు..? ఈ దేశానికి ఎందుకంత ప్రేమ..?

ఎవరి గురించైనా పది, ఇరవై, వంద.. రెండొందలు, మూడొందల ఏళ్ల వరకే చెప్పుకుంటామేమో. కానీ, రాముడి గురించి ఏడువేల ఏళ్ల నుంచి ఈ జాతి తమ ప్రతినిధిగా చెప్పుకుంటోంది. మర్యాద పురుషోత్తముడు అనే పేరుతో పిలుచుకుంటోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 21, 2024 | 01:12 PMLast Updated on: Jan 21, 2024 | 1:13 PM

Ayodhya Ram Mandir Inauguration Why Sri Ram Is Roll Model To All

AYODHYA RAM MANDIR: భారతదేశం ఆత్మ.. శ్రీ రాముడు. రాముడు అనేవాడు ఒక కులానికి, ఒక మతానికో, ఒక వర్గానికో సంబంధించిన వాడు కాదు. రాముడు ఒక వ్యక్తిత్వం. ప్రతి వ్యక్తి సంపూర్ణ మానవుడిగా ఉండాలంటే అనుసరించాల్సిన వ్యక్తిత్వమే రాముడు. ఆ శ్రీ రాముడు ఎందుకు గొప్పవాడని చాలా మంది ప్రశ్నిస్తుంటారు. రాముడు ఎందుకు గొప్పవాడంటే సుమారు ఏడువేల రెండొందల సంవత్సరాల నుంచి ఆ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే, ఇన్నివేల సంవత్సరాల పాటు ఈ చరిత్రలో రాముడనే పాత్ర తరతరాలుగా ఒక తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతోంది. అది ఎంత మహిమాన్విత వ్యక్తిత్వం అయ్యుంటే అలా జరుగుతుంది..!

Ramcharan: రామ్ చరణ్‌ కారును వెంబడించిన అభిమానులు.. షాక్‌ ఇచ్చిన చెర్రీ!

ఎవరి గురించైనా పది, ఇరవై, వంద.. రెండొందలు, మూడొందల ఏళ్ల వరకే చెప్పుకుంటామేమో. కానీ, రాముడి గురించి ఏడువేల ఏళ్ల నుంచి ఈ జాతి తమ ప్రతినిధిగా చెప్పుకుంటోంది. మర్యాద పురుషోత్తముడు అనే పేరుతో పిలుచుకుంటోంది. రాముడు భారతీయల ఆత్మ, భారతీయుల ఉమ్మడి సంస్కృతిలో రాముడే ప్రధానం. ప్రతి ఇంటిలోనూ రాముడుంటాడు. రాముడి కథ తెలియని ఇల్లుండదు. మీరు రాముణ్ని విశ్వసించండి.. విశ్వసించకపోండి.. రాముణ్ని అనుసరించండి.. అనుసరించకపోండి.. కానీ, మీకు కచ్చితంగా రాముడు తెలిసి ఉంటాడు. రాముణ్ని తెలుసుకోవటానికి మతాలు, కులాలు.. ఇవేవీ అడ్డుకాదు. రాముడి గురించి తెలుసుకోవటం అంటే భారత దేశం గురించి తెలుసుకోవటమే. భారతీయ సాంస్కృతిక ప్రతినిధి రాముడు. ఇంట్లో నలుగురు పుడితే అందులో ఒకరు రాముడి పేరుతో ఉంటారు. రాము, రాంబాబు అని పిలుస్తారు. జయరాం, సాయిరాం అంటారు. భారతీయుల జీవన విధానంలో రాముడు మమేకమై ఉంటాడు. మనిషి ఎలా ఉండాలి అంటే రాముడిలా ఉండాలి అని చెప్తారు. పరిపాలన ఎలా ఉండాలి అంటే, శ్రీరాముడి పాలనలా ఉండాలంటారు. కొడుకు ఎలా ఉండాలి.. భర్త ఎలా ఉండాలి.. రాజు ఎలా ఉండాలి అంటే అన్నింటికీ రాముడిలాగే ఉండాలంటారు.

అందుకే మర్యాద పురుషోత్తముడు భారతీయులందరికీ ఒక రోల్‌మోడల్‌. రాముణ్ని లక్ష్యంగా పెట్టుకుంటే భారత దేశంలో ప్రతి వ్యక్తి ఎదుగుతాడు. రాముడిలాగా బతకగలుగుతారో లేదో కానీ, అందుకు ప్రయత్నమైతే ప్రతి మనిషి చేస్తూనే ఉంటాడు. మంచితనానికి ఒక సింబాలిక్‌ కేరెక్టర్‌ రాముడు. అందుకే రాముడు మంచి బాలుడు అని అంటాం. రాముడు అనే వ్యక్తిలోనే ఒక మంచి కొడుకు, ఒక మంచి పాలకుడు, ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రి.. ఇన్ని కేరెక్టర్స్‌ కనిపిస్తాయి. అందుకే ఏడువేల సంవత్సరాలైనా కూడా రాముడి చరిత్ర అంతరించి పోలేదు. రేపటి తరాలకు కూడా ఇంకా రాముడు ఆదర్శప్రాయుడిగానే ఉంటున్నాడు. ఒక వ్యక్తి ఇలా ఉండాలి, ఒక పాలకుడు ఇలా ఉండాలి అంటే రాముడు తప్ప మరో ఉదాహరణ కనిపించదు. అందుకే, రాముడిని ఇప్పటికీ ఈ సంస్కృతితో కొనసాగుతూ ఉన్నాడు. రాజులు, చక్రవర్తులు, కవులు, రచయితలు, రాక్షసులు అనంతకోటి పుట్టి నశించి పోతూ ఉంటారు. కానీ, భారతదేశంలో మాత్రం రాముడు కొనసాగుతూనే ఉంటాడు. 1528లో రాముడి ఆలయాన్ని పడకొడితే.. 500 ఏళ్ల తర్వాత కూడా మళ్లీ దాన్ని ఈ జాతి పునరుద్ధరించుకుందీ అంటే.. శ్రీరామచంద్రుడు అనే వ్యక్తిపై ఎంత ఆపేక్ష, భక్తి మమకారం లేకపోతే ఇది జరుగుతుంది? భారతదేశంలో రాముడి ఆలయం లేని ఊరుంటుందా? రామాలయం వీధి లేని ఊరుంటుందా..?

Ayodhya Ram Mandir : రామాయణం సీరియల్ టీమ్‌కు అరుదైన గౌరవం.. అయోధ్య ట్రస్ట్ నుంచి అందిన ప్రత్యేక ఆహ్వానం

రాముడు, రామాలయం ఊరికి రాష్ట్రానికి దేశానికి చిరునామాలాంటిది. అయిదువందల ఏళ్ల తర్వాత ఆ ఆలయాన్ని పునరుద్ధరించటంలో దేశం మొత్తం ఒకటయిందీ అంటే ఈ దేశంపై రాముడి ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది. రాముణ్ని పురాణ పురుషుడిగా మాత్రమే చూడొచ్చు. దేవుడిగా మీరు అంగీకరించొచ్చు.. అంగీకరించకపోవచ్చు. కానీ, భారతదేశానికి, భారతీయ సంస్కృతి, సంప్రదాయానికి రాముడు ప్రతినిధి కాడని ఎవరూ చెప్పలేరు. భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్లో రాముడున్నాడు. అన్ని తరాలకు రాముడున్నాడు. అందువల్ల రాముణ్ని కాదనే పరిస్థితి ఈ దేశానికి లేదు. రాముడికి రాజకీయాలతో సంబంధం లేదు. కులాలు, రాష్ట్రాలు, వర్గాలు, ప్రాంతాలు వీటిలో దేనితోనూ సంబంధం లేదు. రాముడు అందరివాడు. ఈ విషయంలో దేశంలో భిన్నాభిప్రాయాలు ఎవరికీ లేవు. అందుకనే అయోధ్యలో రామాలయ నిర్మాణానికి దేశమంతా మద్దతుగా నిలిచింది. చరిత్రనుంచి భవిష్యత్తుని నిర్మించటం అంటే ఇదే. ఒక ఇతిహాస పురుషుణ్ని నెక్స్ట్‌ జనరేషన్‌కి కూడా ఒక రోల్‌మోడల్‌గా ఈ దేశం ఇవ్వగలుగుతుందంటే రాముడి వ్యక్తిత్వం ఎంత ఆమోదయోగ్యమైనదో ఆలోచించండి. రామాలయం- రాముడి విషయంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేవు. వ్యక్తి, కుటుంబం, రాజ్యం.. ఈ మూడింటి నిర్మాణంలోనూ రాముడనే పాత్ర ఉంటుంది.