AYODHYA RAM TEMPLE: సిమెంట్, ఇనుము వాడకుండానే రామాలయ నిర్మాణం..
ఈ ఆలయం గురించి భవిష్యత్ తరాలు గొప్పగా చెప్పుకొంటాయి. అయితే, అలాంటి ఆలయాన్ని సిమెంట్, ఇనుము వాడకుండా నిర్మించారంటే నమ్ముతారా..? నిజమే.. అయోధ్య రామాలయ నిర్మాణంలో సిమెంట్, ఇనుము అస్సలు వాడలేదు.
AYODHYA RAM TEMPLE: అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న భక్తుల కల మరికొద్ది రోజుల్లో నెరవేరనుంది. రామ మందిరం ఈ నెల 22న ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానుంది. రాములవారు సీతా సమేతంగా ఆలయంలో కొలువుదీరబోతున్నారు. దీంతో అయోధ్య రామ మందిరం చరిత్రలో నిలిచిపోనుంది. ఈ ఆలయం గురించి భవిష్యత్ తరాలు గొప్పగా చెప్పుకొంటాయి. అయితే, అలాంటి ఆలయాన్ని సిమెంట్, ఇనుము వాడకుండా నిర్మించారంటే నమ్ముతారా..?
GUNTUR KAARAM: గుంటూరు కారం మూవీ.. ఆ మలయాళ సినిమాకు ఫ్రీమేకా..?
నిజమే.. అయోధ్య రామాలయ నిర్మాణంలో సిమెంట్, ఇనుము అస్సలు వాడలేదు. ఈ ఆలయం కోసం ప్రత్యేకమైన రాళ్లను వాడారు. దీనికోసం ఉపయోగించిన రాళ్లలో ఒక గాడిని తయారు చేసి.. ఆ గాడిలో ఇంకో రాయి ఇమిడేలా అమర్చారు. ఇలా ఒక రాయితోమరో రాయి కలిసిపోయి.. రాళ్లతోనే ఆలయ నిర్మాణం జరిగింది. ఆలయంలోని ప్రధాన భాగాన్ని రాజస్థాన్‌లోని భరత్‌పూర్ నుంచి తెచ్చిన గులాబి రాయితో నిర్మించారు. ఈ రాయి చాలా బలంగా ఉంటుంది. ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. ఆలయ పునాదిలో కూడా స్టీల్, ఐరన్, సిమెంట్ వాడలేదు. నిజానికి ఆలయం నిర్మించిన ప్రదేశం పునాదులు నిర్మించేందుకు అంత అనువైనది కాదు. అయినప్పటికీ ప్రత్యేక పద్ధతిలో పునాది నిర్మించారు. ఇందుకోసం 14 మీటర్ల లోతు తవ్వారు. రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్ అనే ప్రత్యేక కాంక్రీట్ మిశ్రమాన్ని 56 పొరలతో నింపారు. తర్వాత ఈ కాంక్రీట్ రాయిగా మారుతుంది.
ఇనుము, సిమెంట్ వంటివి వాడకుండా.. ఈ కాంక్రీట్‌తోనే పునాది నిర్మించారు. అనంతరం 21 అడుగుల ఎత్తైన ప్లాట్‌ఫాం నిర్మించడానికి కర్ణాటక, తెలంగాణ నుంచి తెచ్చిన రాయిని ఉపయోగించారు. మందిరాన్ని నాగర్ సంప్రదాయం ప్రకారం నిర్మించాలనుకోవడం వల్లే ఎలాంటి ఇనుము, సిమెంట్ వాడలేదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఉత్తర భారతంలోని హిందూ వాస్తు శిల్ప కళలోని మూడు శైలిలలో నాగర్ శైలి ఒకటి. ప్రతిష్టాత్మక కోణార్క్ దేవాలయం, ఖజురహో, సోమనాథ్ ఆలయాల్ని ఇదే పద్ధతిలో నిర్మించారు. ఇప్పుడు రామాలయ నిర్మాణానికి కూడా ఇదే పద్ధతి వాడారు. అందుకే ఈ ఆలయం ప్రత్యేకంగా నిలిచిపోనుంది.