Ayodhya Rama : అయోధ్య బాల రాముడి విగ్రహం ప్రత్యేకతలివే..
శ్రీరామ భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య బాలరాముడి (Ayodhya Bala Rama) విగ్రహం ప్రతిష్టాపనకు సిద్ధమైంది. అభిజిత్ ముహూర్తంలో పుష్య శుక్లద్వాదశి నాడు 12 గంటల 20 నిమిషాలకు విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించబోతున్నారు. ఈ నిర్ణయంతో మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి(Sculptor) అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) ఖ్యాతి అయోధ్యకు చేరింది.
శ్రీరామ భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్య బాలరాముడి (Ayodhya Bala Rama) విగ్రహం ప్రతిష్టాపనకు సిద్ధమైంది. అభిజిత్ ముహూర్తంలో పుష్య శుక్లద్వాదశి నాడు 12 గంటల 20 నిమిషాలకు విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించబోతున్నారు. ఈ నిర్ణయంతో మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి(Sculptor) అరుణ్ యోగిరాజ్ (Arun Yogiraj) ఖ్యాతి అయోధ్యకు చేరింది. ఈ బాలరాముడి విగ్రహాన్ని చెక్కింది ఆయనే. కేవలం ఇదే కాదు. దేశంలో చాలా గుళ్లలో పూజలందుకుంటున్న చాలా విగ్రహాలను ఆయనే చెక్కారు. ఇక్కడ ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం ఏటంటే. అయోధ్య బాలరాముడి విగ్రహం తయారు చేసిన శిల.. రామదాసు అనే రైతు పొలంలో దొరకడం. ఆ కృష్ణశిలతోనే అరుణ్ యోగి ఈ విగ్రహాన్ని చెక్కారు.
అయోధ్యలోని గురువుల సమక్షంలో శిలను పరీక్షించిన తరువాత విగ్రహం తయారీకి ఇదే శిలను వాడాలని నిర్ణయించారు. అప్పుడు పని మొదలు పెట్టిన అరుణ్ యోగి విగ్రహాన్ని అద్భుతంగా రూపొందించారు. 51 ఇంచులు పొడవు,150 కేజీల బరువుతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. నల్లని కలువ తామరపై ఐదేళ్ల బాలరాముడి రూపంలో మూల విరాట్‌ను చెక్కారు. కాశీకి చెందిన జ్ఞానేశ్వర్ శాస్త్రి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ బాలరాముడి విగ్రహానికి ప్రత్యేక పూజలు జరగబోతున్నాయి. అనంతరం సుముహూర్తంలో విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించబోతున్నారు.
ఈ గర్భగుడిని కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. సూర్య కిరణాలు గర్భగుడిలో పడేలా రూపొందించారు. విగ్రహ ప్రతిష్టాపన నేపథ్యంలో జనవరి 19 నుంచి అయోధ్య ఆలయానికి భక్తులను అనుమతించడంలేదని చెప్పారు అధికారులు. ప్రతిష్టాపనా కార్యక్రమాలు, కొందరు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్‌తో భక్తులను అనుమతించడంలేదని చెప్తున్నారు. జనవరి 23 నుంచి తిరిగి యధావిధిగా భక్తులకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. అయోధ్య రామాలయం గర్భగుడిలో బాలరాముడిని చూసేందుకు భక్తులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.