AJAHAR NARAZ : ఎమ్మెల్సీ రాలేదని అజహర్ నారాజ్.. కాంగ్రెస్ కి రిజైన్ చేయాలని డిసైడ్
తెలంగాణ (Telangana)లో గవర్నర్ (Governor) కోటా కింద తన పేరు సూచిస్తారని మాజీ క్రికెటర్ (Former Cricketer), కాంగ్రెస్ లీడర్ అజారుద్దీన్ ఆశించాడు. అధిష్టానం దగ్గర గట్టి పైరవీయే చేశాడు. కానీ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ ఆయన్ని లైట్ తీసుకుంది.
తెలంగాణ (Telangana)లో గవర్నర్ (Governor) కోటా కింద తన పేరు సూచిస్తారని మాజీ క్రికెటర్ (Former Cricketer), కాంగ్రెస్ లీడర్ అజారుద్దీన్ ఆశించాడు. అధిష్టానం దగ్గర గట్టి పైరవీయే చేశాడు. కానీ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సర్కార్ ఆయన్ని లైట్ తీసుకుంది. TJS అధ్యక్షుడు కోదండ రామ్ (Kodanda Ram)తో పాటు… సియాసత్ ఉర్దూ దినపత్రిక సీనియర్ జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ ను గవర్నర్ కోటాలో సిఫార్సు చేసింది. గవర్నర్ తమిళిసై ఈ ఇద్దరిని ఎంపిక చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు. క్రీడారంగం కింద ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోవాలని అజారుద్దీన్ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దాంతో ఇప్పుడు ఆయనకు కోపం వచ్చింది.
మాజీ క్రికెటర్ అజారుద్దీన్ (Azhar Naraj) ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆయన ఈమధ్యే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. 18 యేళ్ళుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న తనను కాదని ఓ పత్రికాధిపతికి ఎమ్మెల్సీ ఇవ్వడం ఏంటని అజారుద్దీన్ కోపంగా ఉన్నాడు. క్రీడారంగం కోటా నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశించిన అజార్… కాంగ్రెస్ అధిష్టానం దగ్గర బాగానే పైరవీ చేసుకున్నాడు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ముస్లిం అభ్యర్థులు ఎవరూ ఎన్నిక కాలేదు. దాంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒకరికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావించింది. ఎన్నికలకు ముందే మాట ఇచ్చిన ప్రకారం TJS అధ్యక్షుడు కోదండరామ్ ని ఎమ్మెల్సీకి రికమండ్ చేసింది రేవంత్ సర్కార్. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కోసం అజార్ తో పాటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ కూడా ప్రయత్నాలు చేశారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వాళ్ళెవరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వరాదని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. దాంతో షబ్బీర్ అలీని గవర్నమెంట్ అడ్వైజర్ గా కేబినెట్ ర్యాంక్ ఇచ్చి తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
కానీ అజారుద్దీన్ మాత్రం… క్రీడా రంగం నుంచి ఎమ్మెల్సీ సీటు ఆశించారు. అది దక్కకపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ కు రిజైన్ చేయాలని డిసైడ్ అయ్యాడు. కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకుంటానని అంటున్నాడు అజార్. ఆయన గతంలో 2009లో ఉత్తరప్రదేశ్ లో మొరదాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014లో రాజస్థాన్ లోని టోంక్ ఎంపీ స్థానంలో నిలబడి ఓడిపోయారు. HCA అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు… అజారుద్దీన్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆయనపై ప్రస్తుతం కోర్టులో కేసులు కూడా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే కోర్టు కేసులు అడ్డంకిగా మారతాయని కాంగ్రెస్ భావించింది. కానీ వాటిపై స్టే దక్కడంతో ఆఖరి నిమిషంలో జూబ్లీహిల్స్ టిక్కెట్ కేటాయించింది. ఎప్పటికైనా అజారుద్దీన్ పై HCA అక్రమాల కేసుల కత్తి వేలాడుతూనే ఉంది.