BABU MOHAN: కేఏ పాల్ పార్టీలోకి బాబుమోహన్‌.. ఏం హాలత్ ఐపాయె సార్‌…

బీజేపీ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత.. ఏ పార్టీలో చేరుతారు.. కమలం పార్టీ మీద ప్రతీకారం తీర్చుకుంటారా అని ఆసక్తిగా ఎదురుచూసిన వాళ్లను.. తుస్సుమనిపించారు బాబుమోహన్. కేఏ పాల్‌తో దోస్తీ అన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 4, 2024 | 04:45 PMLast Updated on: Mar 04, 2024 | 4:45 PM

Babu Mohan Joined Praja Shanthi Party In The Presence Of Ka Paul 2

BABU MOHAN: ఈ మధ్యే బీజేపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాబుమోహన్.. ఇప్పుడేం చేయబోతున్నారు.. ఏ పార్టీలో చేరబోతున్నారని.. బావ అని పిలిచే కేసీఆర్‌ను మళ్లీ కలుస్తారా.. లేదంటే కొత్త పార్టీ చూసుకుంటారా.. అదీ కాకపోతే రాజకీయాలు దూరంగా ఉంటారా.. ఇలా.. బాబుమోహన్‌ రాజీనామా తర్వాత జరిగిన చర్చ ఇంతా కాదు. తన కొడుకును, తనను బీజేపీని విడదీసిందని ఎన్నికల ముందు పదేపదే ఆరోపణలు గుప్పించిన బాబుమోహన్.. కమలం పార్టీ పెద్దలు కనీసం తనను పట్టించుకోవడం లేదని.. ఫోన్‌లు చేసినా ఎత్తడం లేదని.. ఒకరకంగా అవమానించారంటూ బీజేపీకి బైబై చెప్పారు.

PM MODI VS REVANTH: తమ్ముడు తమ్ముడే.. పెద్దన్న అంటూ రేవంత్ పొగడ్తలు.. అయినా మోడీ ఏసేశాడుగా..

బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు వీడినప్పుడు.. ఆయన చెప్పిన కామన్ రీజన్.. అవమానించడమే! బీజేపీ మీద యుద్ధం ప్రకటించిన తర్వాత.. ఏ పార్టీలో చేరుతారు.. కమలం పార్టీ మీద ప్రతీకారం తీర్చుకుంటారా అని ఆసక్తిగా ఎదురుచూసిన వాళ్లను.. తుస్సుమనిపించారు బాబుమోహన్. కేఏ పాల్‌తో దోస్తీ అన్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబుమోహన్‌.. వరంగల్‌ నుంచి ఎంపీగా బరిలో దిగేందుకు సిద్థం అయ్యారు. బీజేపీ తరఫున వరంగల్ ఎంపీ టికెట్ ఆశించిన బాబుమోహన్.. అవకాశం దక్కదు అని ఫిక్స్ అయి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఐతే ఇప్పుడు కేఏ పాల్ పార్టీలో చేరి.. బరిలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. దీనికంటే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల్సిందని కొందరు.. కేఏ పాల్‌ పార్టీ తప్ప వేరే ఆప్షనే దొరకలేదా సార్ అని ఇంకొందరు.. ఇలా రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

ఒకప్పుడు మంత్రిగా పనిచేసి.. ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఉండి.. ఇప్పుడు దిక్కుమొక్కులేని పార్టీలో చేరడం ఏంటి సార్ అంటూ.. మరికొందరు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. ఎన్టీఆర్‌ మీద అభిమానంతో బాబుమోహన్ టీడీపీలో చేరారు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నుంచి శాసనసభ్యులుగా ఎన్నికై.. సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా విజయం సాధించాడు. 2019లో బీజేపీలో చేరి ఆందోల్ నుంచి ఎమ్మెల్యేగా పోటి చేసి ఓడిపోయారు.