IPL 2024 : బాబూ నరైన్ నువ్వూ బౌలర్ వే కదా.. బౌలర్లపై కాస్త కనికరం చూపించు
వెస్టిండీస్ (West Indies) మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) స్టార్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టించాడు.

Babu Narine, you are also a bowler, show some mercy to the bowlers
వెస్టిండీస్ (West Indies) మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) స్టార్ సునీల్ నరైన్ విధ్వంసం సృష్టించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కాడు. ఓపెనర్‌గా వచ్చిన నరైన్.. రాజస్తాన్ బౌలర్లను ఊచకోత కోశాడు. రాజస్తాన్ (Rajasthan Royals) బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడిని ఆపడం రాజస్తాన్ బౌలర్ల తరం కాలేదు. స్టార్ బ్యాటర్ లా రెచ్చిపోయాడు.
ఈ క్రమంలో కేవలం 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొన్న సునీల్.. 13 ఫోర్లు, 6 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. కాగా నరైన్‌కు ఇది తొలి ఐపీఎల్ సెంచరీ.
ఈ మ్యాచ్‌లో సెంచరీతో అదరగొట్టిన నరైన్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్ల హాల్‌తో పాటు సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా సునీల్ నరైన్ చరిత్ర సృష్టించాడు. 2012 ఐపీఎల్ సీజన్‍లో ఇదే ఈడెన్‌గార్డెన్స్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‍పై నరైన్ 5 వికెట్లతో ,చెలరేగాడు.అలాగే ఐపీఎల్‍లో హ్యాట్రిక్‍తో పాటు సెంచరీ కూడా సాధించిన మూడో ప్లేయర్‌గా సునీల్ నరైన్ నిలిచాడు. 2013 ఐపీఎల్ సీజన్‍లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‍పై నరైన్ హ్యాట్రిక్ తీశాడు. ఐపీఎల్‌లో 100 వికెట్లతో పాటు సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా కూడా నరైన్ రికార్డు సృష్టించాడు. నరైన్ ఇప్పటివరకు ఐపీఎల్‌లో 170 వికెట్లు పడగొట్టాడు.