హీరోయిన్ కేసుపై బాబు సంచలన వ్యాఖ్యలు…!
ముంబైకి చెందిన నటి జేత్వాని కేసు వ్యవహారంపై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ కేసులో ఉన్న ఐపిఎస్ అధికారులు ఎవరు అనే దానిపై ఆయన ఇప్పటికే ఆరా తీసినట్టు తెలుస్తోంది.

ముంబైకి చెందిన నటి జేత్వాని కేసు వ్యవహారంపై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ కేసులో ఉన్న ఐపిఎస్ అధికారులు ఎవరు అనే దానిపై ఆయన ఇప్పటికే ఆరా తీసినట్టు తెలుస్తోంది. తాజాగా పోలీసు ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు నిర్వహించిన భేటీలో ఈ కేసు విషయంలో కీలక చర్చకు వచ్చింది. పలు కీలక కేసులను సీఎం చంద్రబాబు సమీక్షించారు. డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన ఆయన జత్వానీ, గుడ్లవల్లేరు ఘటనలపై పోలీసు ఉన్నతాధికారులను వివరణ కోరారు.
గుడ్లవల్లేరు ఘటనపై పూర్తి విచారణ జరపాలని ఆదేశించారు. జత్వానీ కేసు విషయాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. జత్వానీ కేసులో పారదర్శకంగా విచారణ జరపాలని, కేసులో ఎంతపెద్దవారున్నా వెనుకంజ వేయొద్దని స్పష్టం చేసారు. జత్వానీ కేసులో విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వంలో జరిగిన మదనపల్లె ఘటన విచారణపై కూడా ఆయన ఆరా తీసారు. హీరోయిన్ కి కచ్చితంగా న్యాయం జరగాల్సిందే అని ఆయన స్పష్టం చేయడంతో అధికారులు కూడా ఈ కేసుపై సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.