US Child Thieves : బ్యాంకు దోచుకున్న పిల్ల దొంగలు ! ఆటలాడుకోవలసిన వయసులో ఈ పనులేంటిరా..
ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాల్సిన టైమ్ లో పాకెట్ మనీ కోసం ఏకంగా ఓ బ్యాంకులో దొంగతనం చేశారు ముగ్గురు పిల్లలు.. అమెరికాలోని టెక్సస్ లో వెల్స్ ఫార్గో బ్యాంకులో ఈ సంఘటన జరిగింది.

Baby thieves hiding in the bank! What are these things at the age of playing..
ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయాల్సిన టైమ్ లో పాకెట్ మనీ కోసం ఏకంగా ఓ బ్యాంకులో దొంగతనం చేశారు ముగ్గురు పిల్లలు.. అమెరికాలోని టెక్సస్ లో వెల్స్ ఫార్గో బ్యాంకులో ఈ సంఘటన జరిగింది.
పిల్లల్లో ఒకడి వయస్సు 11, మరొకడికి 12, ఇంకొకడికి 16 ఏళ్లు ఉంటాయి. పాకెట్ మనీ కోసం తల్లి దండ్రులు డబ్బులివ్వలేదో… లేదంటే జల్సాలకు అలవాటు పడ్డారో గానీ…. డబ్బుల కోసం బ్యాంకు దొంగతనానికి పాల్పడ్డారు. క్యాషియర్ ను తుపాకితో బెదిరించి చేతికి అందిన డబ్బులతో పారిపోయారు. ఈ నెల 14న టెక్సస్ లోని వెల్స్ ఫార్గో బ్యాంకులో ఈ చోరీ జరిగింది. పిల్లల దొంగతనం విజువల్స్ అక్కడి సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాంతో ఆ ముగ్గురి ఫొటోలను FBI అధికారులు X లో పోస్ట్ చేశారు. ఈ లిటిల్ రాస్కె ల్స్ ని గుర్తించడానికి సాయం చేయండి అంటూ జనానికి విజ్ఞప్తి చేశారు. ఈ ముగ్గురిలో ఇద్దరిని వాళ్ల తల్లిదండ్రులే గుర్తించి FBIకి కాల్ చేసి పట్టించారు. మరో కుర్రాడిని పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. చోరీ జరిగిన వారం రోజుల తర్వాత ఈ ముగ్గురు పిల్లదొంగలను FBI అధికారులు అరెస్ట్ చేశారు.