9 మందిని కాపాడిన JCB డ్రైవర్‌ సుభాన్‌ బ్యాగ్రౌండ్‌

ఖమ్మంలోని ప్రకాష్‌ నగర్‌ బ్రిడ్జ్‌మీద భారీ వరద నుంచి 9 మందిని ప్రాణాలకు తెగించి కాపాడటంతో జేసీబీ డ్రైవర్‌ సుభాన్‌ ఒక్కసారిగా హీరో ఐపోయాడు. రెండు రోజులు భారీగా కురిసి వర్షానికి ఖమ్మంను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో ప్రకాష్‌నగర్‌ బ్రిడ్జ్‌ పూర్తిగా మునిగిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 4, 2024 | 01:20 PMLast Updated on: Sep 04, 2024 | 1:20 PM

Background Of Jcb Driver Subhan Who Saved 9 People

ఖమ్మంలోని ప్రకాష్‌ నగర్‌ బ్రిడ్జ్‌మీద భారీ వరద నుంచి 9 మందిని ప్రాణాలకు తెగించి కాపాడటంతో జేసీబీ డ్రైవర్‌ సుభాన్‌ ఒక్కసారిగా హీరో ఐపోయాడు. రెండు రోజులు భారీగా కురిసి వర్షానికి ఖమ్మంను వరదలు ముంచెత్తాయి. ఈ వరదల్లో ప్రకాష్‌నగర్‌ బ్రిడ్జ్‌ పూర్తిగా మునిగిపోయింది. కానీ అప్పటికే బ్రిడ్జ్‌ మీద ఎటూ వెళ్లలేని స్థితితో 9 మంది చిక్కుకుపోయారు. వరద ప్రవాహం బీభత్సంగా ఉంది. బ్రిడ్జ్‌ ఎంతసేపు నిలబడి ఉంటుందో తెలియని పరిస్థితి. వెళ్లి కాపాడాలంటే గజ ఈతగాళ్లు కూడా తట్టుకోలేని వరద వస్తోంది.

కానీ.. ఓ జేసీబీ డ్రైవర్‌ మాత్రం.. పోతే నేను ఒక్కన్నే కానీ వస్తే 9 మంది ప్రాణాలు అంటూ జేసీబీని ముందుకు కదిలించాడు. 9 మందిని ప్రాణాలతో ఒడ్డుకు తీసుకువచ్చాడు. తన ప్రాణాలకు తెగించి 9 మంది ప్రాణం నిలిపిన సుభానీ హర్యానాకు చెందిన వ్యక్తి. దాదాపు 8 ఏళ్ల నుంచి ఖమ్మంలో ఉంటుంన్నాడు. వెంకటగిరికి చెందని వెంకటరమణ అనే వ్యక్తి దగ్గర జేసీబీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆ జేసీబీతోనే 9 మందిని వరద నుంచి రక్షించాడు సుభాన్‌.

ఇక్కని కంటే గొప్ప విషయం ఏంటి అంటే సుభాన్‌ దివ్యాంగుడు. ఒక కాలు సరిగ్గా ఉండదు. నడవటం కూడా సరిగ్గా రాదు. కానీ జేసీబీ నడపటంలో మాత్రం మంచి పట్ట ఉండి. 9 మందిని కాపాడేందుకు మొదట సుభాన్‌ జేసీబీ నీళ్లలోకి దింపినప్పుడు రెండుసార్లు ప్రయత్నం విఫలమయ్యింది. ఇంజన్‌ ఆగిపోయింది. కానీ మూడోసారి కూడా ప్రయత్నించి విజయం సాధించాడు సుభాన్‌. దైవం మానుష రూపేణా అన్నట్టు.. దివ్యాంగుడైనా ఆ 9 మంది ప్రాణాలు కాపాడి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపాడు.