World Cup : క్రికెట్ ఫాన్స్ కు బ్యాడ్ న్యూస్.. భారత్,పాక్ పోరుకు వర్షం

టీ ట్వంటీ (T20) వ‌ర‌ల్డ్‌క‌ప్‌ (World Cup) లో హై వోల్టేజ్ క్రికెట్ స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. ఆదివారం న్యూయ‌ర్క్ (New York) వేదిక‌గా భార‌త్‌-పాకిస్తాన్ (India Pakistan) జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 9, 2024 | 12:30 PMLast Updated on: Jun 09, 2024 | 12:30 PM

Bad News For Cricket Fans Rain For India Pak Fight

 

టీ ట్వంటీ (T20) వ‌ర‌ల్డ్‌క‌ప్‌ (World Cup) లో హై వోల్టేజ్ క్రికెట్ స‌మ‌రానికి రంగం సిద్ద‌మైంది. ఆదివారం న్యూయ‌ర్క్ (New York) వేదిక‌గా భార‌త్‌-పాకిస్తాన్ (India Pakistan) జ‌ట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ చిరకాల ప్ర‌త్య‌ర్థుల పోరును వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల అభిమానులకు బ్యాడ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే ఛాన్స్ ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో న్యూయర్క్‌లో వర్షం పడే అవకాశం ఉందని అక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకటించింది.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ సమయంలో 40 శాతం నుంచి 50 శాతం వరకు వర్షం పడే అవకాశం ఉందని అక్యూ వెదర్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది. వర్ష సూచన మధ్యాహ్నం 1 గంట సమయానికి 10 శాతానికి తగ్గి.. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ 40 శాతానికి పెరగనుందని అంచనా వేసింది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు.