ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్, గబ్బా టెస్టుకు వర్షం ముప్పు
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా సాగుతోంది. తొలి టెస్టులో భారత్ గెలిస్తే... తర్వాత పుంజుకున్న కంగారూలు అడిలైడ్ లో రివేంజ్ తీర్చుకున్నారు. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ హోరాహోరీగా సాగుతోంది. తొలి టెస్టులో భారత్ గెలిస్తే… తర్వాత పుంజుకున్న కంగారూలు అడిలైడ్ లో రివేంజ్ తీర్చుకున్నారు. ఫలితంగా ఐదు టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇప్పుడు మూడో టెస్టుతో తమ ఆధిక్యం పెంచుకునేందుకు రెండు టీమ్స్ కూడా ఉత్సహంగా ఎదురుచూస్తున్నాయి. తమకు తిరుగులేని రికార్డు ఉన్న గబ్బాలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆసీస్ పట్టుదలగా ఉంటే.. గత టూర్ మ్యాజిక్ ను రిపీట్ చేసేందుకు భారత్ ఎదురుచూస్తోంది. అయితే ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 5.50 గంటల నుంచి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ జరగనున్న ఐదు రోజుల్లోనూ 40శాతం వర్షం కురిసే ఛాన్స్ ఉన్నట్లు అక్యూవెదర్ తెలిపింది.
గత రెండు రోజుల నుంచి బ్రిస్బేన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయిలో మూడో టెస్టు మ్యాచ్ జరగడం కష్టమని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. దీంతో భారత అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ గబ్బా టెస్టులో టీమిండియా తప్పక గెలవాల్సిందే. నిజానికి స్వదేశంలో కివీస్ తో సిరీస్ ముందు వరకూ భారత జట్టుకు ఫైనల్ బెర్త్ ఖాయమని అంతా భావించారు. అయితే న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవంతో సీన్ రివర్స్ అయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ మిగిలిన మ్యాచ్ లు గెలిస్తే ఇతర జట్లతో సంబంధం లేకుండా డబ్ల్యూటీసీ ఫైనల్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడినా అవకాశమున్నప్పటకీ… మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అందుకే గత టూర్ లో చారిత్రక విజయాన్ని అందించిన గబ్బాలో పూర్తి మ్యాచ్ జరిగి భారత్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఓ మాదిరి వర్షం పడినప్పటకీ అత్యుత్తమ డ్రైనేజీ వ్యవస్థ అందుబాటులో ఉండడంతో త్వరగానే గ్రౌండ్ ను రెడీ చేసే అవకాశాలున్నాయి.