Badrinath : బద్రీనాథ్ హైవే మూసివేత.. చిక్కుకుపోయిన 3000 మంది యాత్రికులు!

ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు.. వరదలకు ఉత్తరాఖండ్ రాష్ట్రాం అతలకుతలం అవుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 12, 2024 | 12:37 PMLast Updated on: Jul 12, 2024 | 12:37 PM

Badrinath Highway Closure 3000 Stranded Pilgrims

ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు.. వరదలకు ఉత్తరాఖండ్ రాష్ట్రాం అతలకుతలం అవుతుంది. ఇటీవలే బద్రినాథ‌ నేషనల్ హైవే పై విరిగిపడ్డ కొండచరియలు వల్ల బద్రీనాథ్ హైవేను తాత్కాలికంగా bro మూసీవేసింది. బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజు మూసివేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బద్రినాథ్ హైవే మూసీవేయడంతో దాదాపు 3,000 మంది యాత్రికులు, ప్రయాణికులు అక్కడే చిక్కుకుపోయారు. జోషిమఠ్ వద్ద కొండచరియలు విరిగి పడడంతో రహదారిని మూసివేశారు. మరో 24 గంటల పాటు రోడ్డును బ్లాక్ చేయనున్నట్లు సమాచారం.. ప్రయాణికులను SDRF, NDRF బృందాల సహాయంతో సురక్షితంగా తరలిస్తున్నామని, ఆహారం, నీరు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్, జూలైలో ఈ వర్షాలకు భారీగా.. కొండచరియలు విరిగిపడుతున్నాయి.

దీంతో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు 260కి పైగా రోడ్లు మూసివేశారు. ప్రస్తుతం ఉత్తరాఖండ్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైవే మూసివేతతో బద్రీనాథ్, జోషిమఠ్‌, నీతి, మన, తపోవన్, మలారి, లత, రాయిని, పాండుకేశ్వర్, హేమకుండ్ సాహిబ్‌లతో కనెక్టివిటీ తెగిపోయింది. సుమారు 3,000 మంది యాత్రికులు (Devotees Stranded) హైవేపై చిక్కుకుపోయారు. రహదారిని క్లియర్‌ చేసేందుకు బోర్డర్‌ రోడ్‌ ఆర్గనైజేషన్‌ (BRO) అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు 241 ఎక్స్‌కవేటర్లను అక్కడ మోహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా ఛార్‌దామ్‌ యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.