Bahubali statue : అది ప్రభాస్ విగ్రహం..? వార్నర్ బొమ్మ..?
ప్రభాస్ విగ్రహం పెడితే ఫ్యాన్స్‌కు సంతోషించాలో.. బాధపడాలో తెలియడం లేదు. విగ్రహం పెడితే ఎవరికైనా ఆనందమేగానీ.. ఎందుకు ఫీలవుతాడన్న డౌట్ మీకు వస్తే.. ఈ చిత్రం కంపల్సరీ చూసేయాలి. డార్లింగ్ ఫ్యాన్సే కాదు.. ఓ నిర్మాత కూడా ఎందుకు బాధపడ్డాడో మీకే తెలుస్తుంది.

Bahubali wax statue was recently installed in a museum in Mysore They commented that Prabhas is not in Baahubali getup He looks like David Warner
ప్రభాస్ విగ్రహం పెడితే ఫ్యాన్స్‌కు సంతోషించాలో.. బాధపడాలో తెలియడం లేదు. విగ్రహం పెడితే ఎవరికైనా ఆనందమేగానీ.. ఎందుకు ఫీలవుతాడన్న డౌట్ మీకు వస్తే.. ఈ చిత్రం కంపల్సరీ చూసేయాలి. డార్లింగ్ ఫ్యాన్సే కాదు.. ఓ నిర్మాత కూడా ఎందుకు బాధపడ్డాడో మీకే తెలుస్తుంది.
మైనపు విగ్రహాలంటే అందరికీ ముందుగా లండన్‌లోని మేడం టుస్సాడ్స్ గుర్తుకొస్తుంది. ఇప్పటికే బాహుబలి మైనపు విగ్రహం.. మహేశ్ వాక్స్ ఐడెల్‌ను అక్కడ ఉంచారు. త్వరలో బన్నీ విగ్రహాన్ని కూడా కూడా పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి.. నిర్వాహకులు అధికారికంగా ప్రకటించలేదు.
మైసూర్ లో బాహుబలి మైనపు విగ్రహం..
లేటెస్ట్‌గా మైసూర్‌లోని ఓ మ్యూజియంలో బాహుబలి మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫొటోలు.. వీడియోలు బయటకు రాగా.. ఈ విగ్రహం ట్రోలింగ్‌కు గురైంది. బాహుబలి గెటప్‌లో వుంది ప్రభాస్ కాదని.. డేవిడ్ వార్నర్‌లా వున్నాడంటూ కామెంట్స్ చేశారు. ఈ విగ్రహం ఎవరిది? అంటూ… ఫజిల్ అయిపోయింది.
మైసూర్‌లోని ప్రభాస్ మైనపు విగ్రహంపై ట్రోలింగ్‌తో బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాహుబలి విగ్రహం చేసేటప్పుడు తమ దగ్గర అధికారికంగా పర్మిషన్ తీసుకోవాలి. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఈ విగ్రహాన్ని తొలగించే చర్యలు తీసుకుంటామని పోస్ట్ చేశారు. అసలు ఎవర్ని వుద్దేశించి బాహుబలి గెటప్‌ను వాడుకున్నాడు? ప్రభాస్‌నే అనుకుంటే మాత్రం.. ఏ వైపున చూసిన డార్లింగ్ ఛాయలు కనిపించలేదు. మరి ప్రొడ్యూసర్ ట్వీట్‌తో మ్యూజియం నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.