Kodi Kathi Srinu : కోడి కత్తి శ్రీనుకు బెయిల్… ఎన్నికల ముందు భలే వచ్చిందే !
కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌కు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. 25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని స్పష్టం చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని శ్రీనివాస్‌ను ఆదేశించింది.

Bail for Kodi Kathi Srinu... even before the election!
కోడికత్తి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్‌కు బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. 25వేల పూచీకత్తుతో రెండు ష్యూరిటీలు సమర్పించాలని.. ప్రతి ఆదివారం ముమ్మిడివరం పీఎస్‌లో హాజరుకావాలని స్పష్టం చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని శ్రీనివాస్‌ను ఆదేశించింది. కోడికత్తి కేసులో అరెస్టైన శ్రీనివాస్ ఐదేళ్లుగా జైలులోనే ఉన్నారు. బెయిల్‌కు సంబంధించిన కాపీలు అందగానే జైలు నుంచి శ్రీను విడుదలకాబోతున్నారు. ర్యాలీలు, సభల్లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయ్.
తన కుమారుడికి బెయిల్ రావడం సంతోషంగా ఉందన్నారు శ్రీనివాసరావు తల్లి సావిత్రి. ఐదేళ్లుగా తన కుమారుడి పరిస్థితి చూసి బాధపడ్డామని.. తన కుమారుడు ఏ తప్పూ చేయలేదన్నారు. కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు చేయాలంటూ.. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు పిటిషన్ దాఖలు చేశారు. శ్రీనుకు కోడికత్తి కేసులో ఐదేళ్ల నుంచి బెయిల్ రాలేదని.. అప్పటి నుంచి జైలులో ఉన్నారని కోర్టుకు వివరించారు. సీఎం జగన్ వచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలని శ్రీనివాస్ తల్లి, సోదరుడు నిరవధిక దీక్షలు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ చేయాలని కోర్టును అభ్యర్థించారు.. విచారణ జరిపిన కోర్టు బెయిల్ మంజూర్ చేసింది.
సీఎం జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా… 2018 అక్టోబర్ 25న ఆయనపై కోడికత్తితో దాడి జరిగింది. విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటనలో కేసులో శ్రీనివాస్‌ను పోలీసుల అరెస్టు చేశారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. అయినా ఊరట లభించలేదు.. చివరికి హైకోర్టులో బెయిల్ మంజూరైంది. ఐతే ఏపీలో ఎన్నికల మూడ్ మొదలైన వేళ.. కోడికత్తి శ్రీనుకు బెయిల్ మంజూరు కావడం… ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.