HMDA, Shiva Balakrishna : వాళ్లిద్దరి అండతోనే బాలకృష్ణ అక్రమాలు! ఎవరా IAS ? ఎవరా మంత్రి ?

HMDA మాజీ అధికారిక శివబాలకృష్ణ (Shiva Balakrishna) కేసులో తవ్వుతున్న కొద్దీ నిజాలు బయటికి వస్తన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తూ వందల కోట్లు కూడబెట్టాడు నిందితుడు శివబాలకృష్ణ.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 2, 2024 | 12:28 PMLast Updated on: Feb 02, 2024 | 12:28 PM

Balakrishnas Irregularities With Both Of Them Who Is Ias Who Is The Minister

HMDA మాజీ అధికారిక శివబాలకృష్ణ (Shiva Balakrishna) కేసులో తవ్వుతున్న కొద్దీ నిజాలు బయటికి వస్తన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇస్తూ వందల కోట్లు కూడబెట్టాడు నిందితుడు శివబాలకృష్ణ. ఇప్పటికే శివబాలకృష్ణను రెండు రోజులు విచారించిన అధికారులు మూడో రోజు కీలక విషయాలు నిందితుడి నుంచి రాబట్టారు. రైడ్స్‌లో విచారణలో తాము సేకరించిన అన్ని ఆధారాలను శివబాలకృష్ణ ముందు పెట్టారు. దీంతో వేరే దారి లేక.. చేసిన తప్పులు మొత్తం ఒక్కొక్కటిగా బయట పెట్టడం ప్రారంభించాడు శివబాలకృష్ణ. నిందితుడి పేరుపై మొత్తం 8 బ్యాంక్‌ లాకర్లు ఉన్నట్టు గుర్తించారు అధికారులు. ఇందులో మూడు లాకర్లు.. శివబాలకృష్ణ బినామీ భరత్‌ పేరుపై ఉన్నట్టు గుర్తించారు. రీసెంట్‌గానే తన బినామీలుగా అనుమానిస్తున్న వ్యక్తులకు హోండా సిటీ కార్లు గిఫ్ట్‌గా ఇచ్చాడు శివబాలకృష్. కార్లు గిఫ్ట్‌ ఇవ్వడానికి కారణం ఏంటి. ఏ లావాదేవీకి బదులుగా కార్లు గిఫ్ట్‌గా ఇచ్చారు అనే విషయంలో ఆరా తీస్తున్నారు.

ఇక తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే కొన్ని రోజులు ముందు కూడా 90 లే అవుట్‌లకు శివబాలకృష్ణ అనుమతి ఇచ్చినట్టు విచారణలో గుర్తించారు అధికారులు. ఈ అనుమతుల్లో జరిగిన అక్రమాలను కూడా తవ్వుతురన్నారు. కేవలం డబ్బు రూపంలోనే కాకుండా చాలా రూపాల్లో శివబాలకృష్ణ అవినీతికి పాల్పడినట్టు గుర్తించారు. అక్రమంగా సంపాదించిన డబ్బును శివబాలకృష్ణ రియల్‌ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాడు. హైదరాబాద్‌లో కేంద్రంగా పని చేస్తున్న రెండు ఇన్‌ఫ్టా కంపెనీలతో శివబాలకృష్ణకు సంబంధాలున్నట్టు అధికారులు గుర్తించారు. వీటిల్లోనే శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టినట్టు అనుమానిస్తున్నారు. శివబాలకృష్ణ మిత్రులు, బంధులు, సన్నిహితులు అందిరి ఇళ్లు కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. తన సర్వీస్‌లో పవర్‌ను అడ్డుపెట్టుకుని నిందితుడు కోట్ల రూపాయలు వెనకేసినట్టు అధికారులు గుర్తించారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఉన్నతాధికారుల నుంచి ప్రభుత్వం నుంచి కూడా శివబాలకృష్ణకు సహకారం అందినట్టు అనుమానిస్తున్నారు. ఓ ఐఏఎస్‌ అధికారి శివబాలకృష్ణకు సహాయ సహకారాలందించినట్టు అనుమానిస్తున్నారు. ఓ మంత్రి అండదండలు కూడా శివబాలకృష్ణకు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతానికి ఆ ఇద్దరూ ఎవరు అన్ని విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ త్వరలోనే వాళ్ల పేర్లు కూడా డయటికి వచ్చే అవకాశముందని చెప్తున్నారు పోలీసులు. పూర్తి స్థాయి విచారణ తరువాత చాలా మంది పెద్దవాళ్ల పేర్తు బయటికి వచ్చే ఛాన్స్‌ ఉంది అంటున్నారు. ఇప్పటికే వందల కోట్లకు పడగెత్తిన అవినితి అధికారి శివబాలకృష్ణ కేసులో ఇంకా ఎలాంటి విషయాలు బయటికి వస్తాయో చూడాలి.