Balwinder Singh: ముల్లు వెనక్కు తిరిగే గడియారం తయారు చేసిన ఇంజనీర్..
నేటి యుగంలో శాస్త్రం, సాంకేతికత ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నాయి. వాటికి తగ్గట్టుగానే యువత బీటెక్, ఎంబీబీఎస్ లో చేరి రాణిస్తున్నారు. అలాగే కాలంతో పాటూ పరుగులు తీయాలనుకునే వారు కొందరు ఉంటారు. కానీ కాలాన్నే వెనక్కి తిప్పాలనుకున్నాడు ఈ ఇంజనీరింగ్ విద్యార్థి. ఇందులో భాగంగా రివర్స్ లో తిరిగేలా గడియారాన్ని తయారు చేశారు.

Balwinder Singh, an engineer in Chandigarh, made a clock that turned back
ఇతని పేరు బల్వీందర్ సింగ్. చండీగఢ్ లో ఉండి ఇంజనీరింగ్ పై ఆసక్తితో బీటెక్ పూర్తిచేశారు. కాలాన్ని వెనక్కి తిప్పడం సాధ్యం కాకపోయినా గడియారపు ముల్లును వెనక్కి తిప్పగలిగాడు. ఇలా రివర్స్ లో తిరిగినప్పటికీ ఇది సమయం మాత్రం కచ్చితంగా చూపించడం విశేషం. దీనిని తయారు చేసేందుకు దాదాపు మూడేళ్లు పట్టిందని చెప్పారు. ఈ గడియారంలో పంజాబీ అక్షరాలను ఏర్పాటు చేశారు. ఇలా గడియారం తయారు చేయాలనే ఆలోచన రావడానికి ప్రదాన కారణం కూడా ఈ సందర్బంగా వివరించారు.
ఒక రోజు నా స్నేహితుడు రాజస్థాన్ వెళ్లాడు. అక్కడ ఒక కోటలోని గడియారం ముల్లు వెనుకకు తిరగడాన్ని గమనించాడు. ఇలా అపసవ్య దిశలో తిరుగుతున్నప్పటికీ సమయాన్ని మాత్రం సరిగ్గా చూపిస్తుందని తనతో చెప్పాడట. ఈ లోకంలో సాధించాలనే పట్టుదల ఉంటే ఎలాంటి దానినైనా సాధించవచ్చు అని బలంగా నమ్ముతాడట. అందుకే మనమే ఈ గడియారాన్ని ఎందుకు తయారు చేయకూడదు అని సంకల్పించుకున్నారు. దీనికోసం విపరీతంగా కష్టపడి వ్యతిరేకదిశలో తిరిగే గడియారాన్ని తయారుచేశాడు. దీనికి ప్రత్యేకతను సంతరించుకోవడం కోసం గడియారంలోని అక్షరాలను పంజాబీ భాషలో ఉంచానని వివరించారు. గతంలో చిన్న టేబుల్ ఫ్యాన్ కూడా తయారు చేశాడట. అందుకు గానూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం ఏర్పరుచుకున్నానని తెలిపారు.
T.V.SRIKAR