Gobi Manchuria ‎Ban : గోవాలో గోబీ మంచూరీయా నిషేధం

గోబీ మంచూరియా టేస్ట్ గా ఉందని చెప్పి... వెనకా ముందూ చూడకుండా లాగించేస్తుంటాం. నోటికి రుచి తగిలితే చాలు అనుకుంటాం... కానీ దాన్ని ఎలా తయారు చేస్తున్నారు... అందులో ఏమేమి కలుపుతున్నారో మాత్రం అస్సలు పట్టించుకోవం. రుచికి అలవాటు పడి ఎడా పెడా తినేస్తే... రోగాల బారిన పడ్డామనుకోండి... ఆ తర్వాత హాస్పిటల్స్ బిల్లులు తడిసిమోపెడు అవుతాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2024 | 03:21 PMLast Updated on: Feb 05, 2024 | 3:21 PM

Ban Gobi Manchuria In Goa

 

గోబీ మంచూరియా (Gobi Manchuria) డిష్ (dish) అంటే చాలామందికి ఇష్టం… చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ లొట్టలేసుకొని తింటారు. మాంసాహారులకు చికెన్ మంచూరియాలు (Chicken Manchuria) ఎంత ఇష్టమో… శాఖాహారులకు గోబీ రిసీప్ అంత ఇష్టం. గోబీని కార్న్ ఫ్లోర్ పిండిలో ముంచి… వేయించి తర్వాత సోయా సాస్, వెనిగర్, పంచదార, టమోటా సాస్ … వీటితో పాటు కాస్త గ్రేవీ వేసి… తయారు చేస్తే… టేస్ట్ అద్దిరిపోతుంది. కానీ గోబీ మంచూరియా తయారీపై అనేక విమర్శలు వస్తున్నాయి. అందుకే గోవాలో ఈ రిసీప్ ను నిషేధించారు. మున్సిపల్ కౌన్సిల్స్, దేవాలయ కమిటీలు వీటిని నిషేధిస్తూ తీర్మానాలు చేస్తున్నాయి. అసలు గోబీ మంచూరియా గోవా (Goa) లో ఎందుకు ఇంత రాద్దాంతం జరుగుతోంది.

గోబీ మంచూరియా టేస్ట్ గా ఉందని చెప్పి… వెనకా ముందూ చూడకుండా లాగించేస్తుంటాం. నోటికి రుచి తగిలితే చాలు అనుకుంటాం… కానీ దాన్ని ఎలా తయారు చేస్తున్నారు… అందులో ఏమేమి కలుపుతున్నారో మాత్రం అస్సలు పట్టించుకోవం. రుచికి అలవాటు పడి ఎడా పెడా తినేస్తే… రోగాల బారిన పడ్డామనుకోండి… ఆ తర్వాత హాస్పిటల్స్ బిల్లులు తడిసిమోపెడు అవుతాయి. అందుకే జనం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రెసిపీ అమ్మకాలను పూర్తిగా నిషేధించింది గోవాలోని మపుసా మున్సిపల్ కౌన్సిల్. ఎక్కడైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో గోబీ మంచూరియా అమ్మినట్టు తెలిస్తే… ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తారు.

అసలు ప్రాబ్లెమ్ ఎక్కడ వచ్చిందంటే… గోబీ మంచూరియాను హోటళ్ళు, స్ట్రీట్ ఫుడ్స్ వాళ్ళు… చాలా అపరిశుభ్రంగా ప్రిపేర్ చేస్తున్నారట. ఈ డిష్ లో ప్రమాదకరమైన సింథటిక్ కలర్స్ తో పాటు బట్టలు ఉతకడానికి ఉపయోగించే పౌడర్ వాడుతున్నారట. నాసిరకం చెట్నీని కూడా వినియోగిస్తున్నారు. సింథటిక్ రంగుతో ఆరోగ్యానికి చాలా హానికరం. మొక్కజొన్న పిండిలో ఓ రకమైన పొడిని కలిపి కాలీఫ్లవర్ ఆకులను వ్యాపారులు ఫ్రై చేస్తుంటారు. అయితే ఆ పొడి తినడానికి వాడేది కాదనీ… బట్టలు ఉతకడానికి ఉపయోగిస్తారని తేలింది. దీంతో అక్కడి స్థానిక సంస్థలు ఒక్కోటి ఈ డిష్ ను నిషేధిస్తున్నాయి.

ప్రముఖ బోడ్డేశ్వర ఆలయం జాతరలో కూడా గోబీ మంచూరియాను నిషేధిస్తూ స్థానిక మున్సిపల్ కౌన్సిల్ పెట్టిన తీర్మానించింది. అక్కడ కూడా నిషేధం అమల్లోకి వచ్చింది. గోవాలోని అనేక ప్రాంతాల్లో గోబీ మంచూరియాను గతంలోనూ స్థానిక సంస్థలు నిషేధించాయి. శ్రీ దామోదర దేవాలయం, కపిలేశ్వరి, సాతేరి దేవి జాతరల్లోనూ గోబీ మంచూరియా తయారు చేసే స్టాల్స్ పై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేశారు. ఫంక్షన్స్ లోనూ దీన్ని నిషేధించారు. సాధారణంగా గోబీ మంచూరియా గోవాలోని హోటళ్ళు, రెస్టారెంట్స్ లో ప్లేట్ 70 నుంచి 100 రూపాయల దాకా అమ్ముతారు. కానీ జాతరల్లో నాసిరకం ఫుడ్ ఐటెమ్స్ ఉపయోగించి 30, 40 రూపాయలకే ప్లేట్ ని అందిస్తున్నారు.

మొదట గోబీరియా మంచూరియా పేరుతో ఈ వంటకాన్ని ముంబైకి చెందిన చైనీస్ చెఫ్ నెల్సన్ వాంగ్ కనిపెట్టారు. 1970లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాలో కేటరింగ్ చేస్తున్నప్పుడు… చికెన్ మంచూరియా తయారు చేశాడు. శాఖాహారులు కూడా ఇలాంటి టేస్ట్ మిస్ అవ్వొద్దని గోబీ మంచూరియా తయారు చేశాడు. అప్పటి నుంచి జనం దీనిపై మనసు పారేసుకున్నారు. బట్… మన దగ్గర అయినా… గోబీ మంచూరియా ఆర్డర్ చేసేటప్పుడు… దాన్ని ఎలా తయారు చేస్తున్నారు… అందులో ఏమేమి ఐటెమ్స్ వాడుతున్నారో ఒకసారి చెక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.