BANDARU SATYANARAYANA: టీడీపీకి షాక్.. వైసీపీలోకి టీడీపీ కీలక నేత
బండారు సత్యనారాయణ.. పెందుర్తి టిక్కెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ టిక్కెట్ జనసేనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ జనసేన నుంచి పంచకర్ల రమేశ్ బాబు పోటీ చేయబోతున్నారు. దీంతో అసంతృప్తితో ఉన్న బండారు.. టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నారు.
BANDARU SATYANARAYANA: అభ్యర్థుల ప్రకటన తర్వాత తిరుగుబాట్లు ఎదుర్కొంటున్న టీడీపీకి మరో షాక్ తగిలే అవకాశం ఉంది. టీడీపీలో టిక్కెట్ దక్కని నేతలు నెమ్మదిగా పార్టీని వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా విశాఖకు చెందిన కీలక నేత బండారు సత్యనారాయణ ఆ పార్టీని వీడబోతున్నట్లు తెలుస్తోంది. బండారు సత్యనారాయణ.. పెందుర్తి టిక్కెట్ ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ టిక్కెట్ జనసేనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ జనసేన నుంచి పంచకర్ల రమేశ్ బాబు పోటీ చేయబోతున్నారు. దీంతో అసంతృప్తితో ఉన్న బండారు.. టీడీపీని వీడే ఆలోచనలో ఉన్నారు.
Ustad Bhagathsingh : వన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఉస్తాద్ నుంచి బిగ్ సర్ ప్రైజ్
ఆయనతో వైసీపీ నేతలు టచ్‌లోకి వెళ్లారు. అతడిని తమ పార్టీలోకి తీసుకోవాలని వైసీపీ భావిస్తోంది. అయితే, బండారు కోరుకుంటున్న పెందుర్తి స్థానాన్ని వైసీపీ ఇప్పటికే అదీప్ రాజ్‌కు కేటాయించింది. ఈ నేపథ్యంలో బండారుకు ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఆయనకు అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తామని వైసీపీ నుంచి హామీ దక్కినట్లు సమాచారం. వైసీపీ నుంచి వచ్చిన ప్రతిపాదనపై బండారు తన మద్దతు దారులతో చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరం బండారు.. వైసీపీలో చేరేది, లేనిది తెలుస్తుంది. మరోవైపు.. జనసేనకు సీట్లు కేటాయించిన పెందుర్తి, ఎలమంచిలి, అనకాపల్లి, విశాఖ సౌత్‌లోని టీడీపీ అసంతృప్తులను ఆయన చేరదీస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాలకు చెందిన టీడీపీ అసంతృప్త నేతలతో కలిసి ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది. అనకాపల్లి ఎంపీగా పోటీ చేయటానికి బండారు ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం.
ఈ ప్రచారంపై బండారు స్పందించారు. వైసీపీలో చేరే అంశంపై తన అనుచరులతో చర్చలు చేస్తున్నట్లు బండారు వెల్లడించారు. రెండు రోజుల్లోనే తన నిర్ణయం అధికారికంగా ప్రకటిస్తానన్నారు. నిజానికి బండారు సత్యానారాయణకు చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బండారు అల్లుడు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. గతంలో రోజాపై విమర్శలు చేసి.. బండారు వార్తల్లో నిలిచారు.