BANDI SANJAY: బీసీ మంత్రి అయినా బీసీ బంధు ఇప్పించలేదు.. గంగులపై బండి సంజయ్ ఫైర్

ప్రవాస భారతీయుల కోసం బీజేపీ కొట్లాడుతుంది. కరీంనగర్ ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయి. కరీంనగర్‌కు ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాలేని దద్దమ్మ గంగుల. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.24 వేలు అందిస్తాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 24, 2023 | 04:15 PMLast Updated on: Nov 24, 2023 | 4:15 PM

Bandi Sanjay Criticised Karimnagar Mla Gangula Kamalakar

BANDI SANJAY: తెలంగాణలో బీసీల తరఫున కరీంనగర్ నుంచి గంగుల కమలాకర్ మంత్రిగా ఉన్నప్పటికీ.. బీసీ బంధు ఇప్పించలేదని విమర్శించారు బీజేపీ నేత బండి సంజయ్. కరీంగనగర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో బండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, గంగులపై విమర్శలు చేశారు. “గంగుల కమలాకర్ బీసీ మంత్రిగా ఉంటూ బీసీలకు బీసీ బంధు పైసలియ్యలేదు. ఇప్పటి వరకు కరీంనగర్ ప్రజలకు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. పేపర్ లీకేజ్ వల్ల తెలంగాణలో ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారు.

Priyanka Gandhi Vadra: బీఆర్‌ఎస్‌‌ను చూసేది మ్యూజియంలోనే.. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ

నిరుద్యోగులకు మద్దతుగా నేను ధర్నా చేస్తే నన్ను జైలుకు పంపారు. రేషన్ బియ్యం కేంద్రమే అందిస్తుంది. ఐకేపీ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుంచి కొనే వడ్ల పైసలన్నీ కేంద్రమే చెల్లిస్తోంది. వడ్లను సేకరించినందుకుగాను కేసీఆర్ ప్రభుత్వానికి బ్రోకరేజీ రూపంలో కమీషన్ కూడా కేంద్రమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. నాది ప్రజల పక్షాన పోరాడిన చరిత్ర. ఆస్తులు సంపాదించినట్లు రుజువు చేస్తే.. అవన్నీ ప్రజలకు రాసిస్తాన. ప్రవాస భారతీయుల కోసం బీజేపీ కొట్లాడుతుంది. కరీంనగర్ ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయి. కరీంనగర్‌కు ఒక్క కొత్త కంపెనీని కూడా తీసుకురాలేని దద్దమ్మ గంగుల. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.24 వేలు అందిస్తాం. బీజేపీ అధికారంలోకి వస్తే వరి కనీస మద్దతు ధర రూ.3100 చేస్తాం.

రైతు పక్షపాతి ఎవరో.. ఎన్నికల సమయంలో మీరే ఆలోచించి ఓటేయాలి. మహిళలకు ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు అందజేస్తాం. కరీంనగర్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులకు భూకబ్జాల చరిత్ర ఉంది. ఎన్నికలు అయిపోగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై కేసులు సెటిల్ చేసుకుంటారు” అని బండి సంజయ్ విమర్శించారు.