BANDI SANJAY: మసీదుకు వెళ్లినా రాముడినే మొక్కుతారు: బండి సంజయ్

బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నమాజ్ మైకులు బంద్ అయితయన్న కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలానే జరుగుతుందా..? కేటీఆర్ చెప్పాలి. వినాయక చవితికి మైకులు పెట్టుకోవాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 16, 2023 | 08:35 PMLast Updated on: Nov 16, 2023 | 8:40 PM

Bandi Sanjay Responded About Cm Kcr Comments

BANDI SANJAY: కొందరు రాజకీయ నాయకులకు అల్లా గురించి తెలియదని, దీంతో మసీదుకు వెళ్లినా రాముడు, సీతనే మొక్కుతున్నారని వ్యాఖ్యానించారు బీజేపీ నేత బండి సంజయ్. గురువారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “మసీదుకుపోయిన రాజకీయ నాయకులు టోపీలు పెట్టుకుని అల్లాను మొక్కడం లేదు. కనీసం అల్లా గురించి వారికి తెలియదు. టోపీ పెట్టుకొని రాముడిని, సీతనే మొక్కుతున్నారు. మసీదుకు వచ్చి నమాజ్ చేస్తున్నారని ముస్లిం సమాజం వారికి ఓట్లు గుద్దుతున్నారు.

KODANDARAM: కోదండరామ్‌కి ఎంపీ సీటు..! కాంగ్రెస్ ఆఫర్.. అందుకే మద్దతు..

తాగి పండుకునే కెసిఆర్‌ను అల్లాతో పోలుస్తారా..? మీరే ఆలోచించుకోవాలి. కెసిఆర్ ఒక పాస్‌పోర్ట్ బ్రోకర్. అలాంటి వ్యక్తిని అల్లాతో పోలుస్తారా..? బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే నమాజ్ మైకులు బంద్ అయితయన్న కేటీఆర్ వ్యాఖ్యలు సరికాదు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలానే జరుగుతుందా..? కేటీఆర్ చెప్పాలి. వినాయక చవితికి మైకులు పెట్టుకోవాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలా..? దేవాలయాల్లో పూజలు చేసే సాధుసంతులు, పూజారులు బయటికి రావాల్సిన అవసరం ఉంది. ముస్లిం మత పెద్దల వలనే సాధుసంతులు బయటికి వచ్చి హిందువుల సంగతి చూడాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు రాగానే కెసిఆర్‌కు రామ జన్మభూమి గుర్తుకొస్తుంది. అవును నేను ధైర్యంగా చెప్తున్నా నేను కర సేవలో పాల్గొన్న. కెసిఆర్ అవసరం అనుకుంటే రామాయణాన్ని మార్చి అయోధ్యలో రాముడు పుట్టలేదని తిరిగి చరిత్ర రాస్తాడు” అని బండి సంజయ్ అన్నారు.
చంపడానికి.. చావడానికీ భయపడను: రాజా సింగ్
ఈ ఎన్నికలు తనకు జీవన్మరణ సమస్య అన్నారు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. పార్టీ నేతలతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజా సింగ్ మాట్లాడుతూ సొంత పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. “గత ఎన్నికల్లో మన పార్టీ వారు ఎవరు కోవర్ట్‌లుగా పని చేశారో ప్రేమ్ సింగ్ రాథోడ్ నాకు చెప్పారు. ఈ సారి అలా చేస్తే వదిలే ప్రసక్తే లేదు. ఇక్కడి నుండి అక్కడకు సమాచారం ఇస్తే.. అక్కడ వారు ఇక్కడకి సమాచారం ఇస్తారు. మరిచిపోకండి. ఈ ఎన్నిక నాకు జీవన్మరణ సమస్య. చావడానికి భయపడను. చంపడానికి భయపడను” అని వ్యాఖ్యానించారు.