Bangalore Rave Party : బెంగళూర్ రేవ్ పార్టీ ఎంట్రీ రూ. 50లక్షలు.. ఒక్క రాత్రికి ఇంతా.. ఏం చేసుంటారంటావ్ ?
బెంగళూరు రేవ్ పార్టీ రచ్చ... తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కంటిన్యూ అవుతోంది. ఆ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీ షేక్ అయింది.

Bangalore Rave Party Entry Rs. 50 lakhs.. this much for one night.. what will you do?
బెంగళూరు రేవ్ పార్టీ రచ్చ… తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కంటిన్యూ అవుతోంది. ఆ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీ షేక్ అయింది. రేవ్ పార్టీలో ఉన్న వారి పేర్లు బయటికి వస్తుండటంతో… కొందరు తాము అసలు అక్కడ లేమని ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఐతే రేవ్ పార్టీకి సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పటివరకు అక్కడ ఎవరెవరున్నారని చర్చ జరగగా.. ఆ పార్టీ ఎంట్రీ ఫీజు గురించి ఇప్పుడు కొత్త డిస్కషన్ మొదలైంది.
ఈ రేవ్ పార్టీకి ఒక్క రోజుకు 50 లక్షల రూపాయల ఎంట్రీ ఫీజు అని పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తోంది. రేవ్ పార్టీకి 100 మంది అటెండ్ కాగా.. అందులో ఇప్పటివరకు ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రేవ్ పార్టీలో భారీగా మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 17 MDMA ట్యాబ్లెట్లు, కొకైన్, ఇతర డ్రగ్స్.. ఆ ఫామ్ హౌస్‌లో దొరికినట్లు పోలీసులు బయటపెట్టారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక నుంచి వంద మంది ఆ పార్టీలో పాల్గొన్నారని.. అందులో 25 మంది యువతులు, డీజేలు, మోడల్స్, యాక్టర్స్, టెక్ ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. సన్‌సెట్ టు సన్‌రైజ్ పేరుతో ఈవెంట్ కండక్ట్ చేయగా.. ఇప్పుడు ఆ ఎంట్రీ ఫీజ్ వ్యవహారం.. టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది.
ఒక్క రాత్రికి 50లక్షలేంటి బ్రో అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుంటే.. ఎకరం అమ్మితే తప్ప ఒక్క రాత్రి పార్టీకి సరిపోవు అంటూ మరికొందరు సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నారు.. 50లక్షలు ఏంది సార్.. మా ఫ్యామిలీ అప్పులన్నీ తీరిపోతాయ్ అంటూ ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు. ఒక్క రాత్రికి 50లక్షలు ఖర్చు చేసి ఎంట్రీ ఇచ్చి.. ఏం చేస్తారంటావ్.. ఎంత తాగినా లక్ష దాటదు కదా.. 50లక్షలు ఎందుకంటావ్ మాస్టారు అంటూ మరికొందరు షేర్ చేస్తున్నారు. వంద మంది పార్టీకి హాజరయ్యారు.. ఒక్కొక్కరికి 50లక్షలు వేసుకున్నా.. 50 కోట్లు అవుతుంది కదా అంటూ మరికొందరు అవాక్కవుతూ మెసేజ్‌లు పెడుతున్నారు.