Barrelakka: పెళ్లి పీటలెక్కనున్న బర్రెలక్క.. అబ్బాయి ఎవరంటే..

బర్రెలక్క ఇప్పుడు పెళ్లికూతురు కాబోతోంది. త్వలోనే బర్రెలక్క పెళ్లి జరగబోతోంది. అబ్బాయిని ఫిక్స్‌ చేసి పెళ్లిపనులు కూడా ప్రారంభించారు శిరీష కుటుంబ సభ్యులు. ఈ వీడియోను స్వయంగా శిరీష తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2024 | 03:59 PMLast Updated on: Mar 20, 2024 | 3:59 PM

Barrelakka Alias Sirisha Going To Marry Soon Groom Is

Barrelakka: ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్ మీడియా ద్వారా పాపులరైన బర్రెలక్క అలియాస్‌ శిరీష గురించి తెలియని వాళ్లు అరుదు. శిరీష అని పిలవడం కంటే బర్రెలక్క అంటేనే ఎక్కువమంది ఈమెను గుర్తు పడతారు. తాను పెంచుకుంటున్న బర్రెలతో ఇన్‌స్టాలో రీల్స్‌ చేస్తూ బర్రెలక్కగా గుర్తింపు తెచ్చుకుంది శిరీష. గతేడాది జరిగిన తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నుంచి పోటీ చేసి అందరికీ షాకిచ్చింది. బర్రెలక్క నిర్ణయంతో తెలంగాణ ఫోకస్‌ మొత్తం బర్రెలక్క మీదకు టర్న్‌ అయ్యింది.

Addanki Dayakar: అయ్యో పాపం.. అద్దంకి దయాకర్‌కు మళ్లీ అన్యాయం..

ఆ ఎన్నికల్లో బర్రెలక్క ఓడిపోయినా.. యావత్‌ తెలంగాణ ప్రజల మద్దతు, ప్రేమ కూడగట్టుకుంది. అలాంటి బర్రెలక్క ఇప్పుడు పెళ్లికూతురు కాబోతోంది. త్వలోనే బర్రెలక్క పెళ్లి జరగబోతోంది. అబ్బాయిని ఫిక్స్‌ చేసి పెళ్లిపనులు కూడా ప్రారంభించారు శిరీష కుటుంబ సభ్యులు. ఈ వీడియోను స్వయంగా శిరీష తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేసింది. త్వరలోనే తన పెళ్లి జరగబోతున్నట్టు తెలిపింది. అయితే అబ్బాయి ఎవరు అనే విషయం మాత్రం ఇంకా రివీల్‌ చేయలేదు. నిజానికి ఇది శిరీషకు రెండో పెళ్లి. గతంలో ఓ వ్యక్తితో శిరీషకు పెళ్లైనా.. కొన్ని రోజులకే వాళ్లు విడిపోయారు. ఆ తరువాత బిగ్‌బాస్‌ విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌తో బర్రెలక్క పెళ్లి జరగబోతోందంటూ వార్తలు వచ్చాయి. చాలా మంది నిజమే అనుకున్నారు. కానీ అదంతా అబద్ధమని.. ఎవరో కావాలనే ఇలాంటి రూమర్‌ క్రియేట్‌ చేశారంటూ బర్రెలక్క స్వయంగా క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆ వార్తలకు చెక్‌ పడింది. కానీ ఇప్పుడు స్వయంగా శిరీషే తన పెళ్లి జరగబోతున్నట్టు చెప్పింది.

పెళ్లి ముందు జరిగిన కార్యక్రమాన్ని తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేసింది. పెళ్లి షాపింగ్‌ వీడియోలను కూడా పోస్ట్‌ చేసి తన ఫ్యాన్స్‌కు తన పెళ్లి గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ ఇస్తూనే ఉంది. అన్ని చెప్పినా తనకు కాబోయే భర్త ఎవరో మాత్రం చెప్పలేదు బర్రెలక్క. పెళ్లి జరిగేవరకూ రివీల్‌ చేయొద్దు అనుకుందో.. లేక గతంలో జరిగిన ఇన్సిడెంట్స్‌ వల్లో తెలియదు కానీ.. అబ్బాయి పేరు కూడా రివీల్‌ చేయలేదు. దీంతో బర్రెలక్కను చేసుకునే అబ్బాయి ఎవరా అని ఆమె ఫ్యాన్స్‌ అంతా మాట్లాడుకుంటున్నారు. మరి బర్రెలక్కను చేసుకుంటున్న ఆ అబ్బాయి ఎవరో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.