Barrelakka pre-wedding : బర్రెలక్క పెళ్లి పాట అదుర్స్‌.. ఘనంగా బర్రెలక్క ప్రీ వెడ్డింగ్‌

బర్రెలక్క (Barrelakka) శిరీష (Shirisha) ప్రీ వెడ్డింగ్‌ (Pre Wedding) చాలా గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి ఫిక్స్‌ అయ్యిందని క్లారిటీ ఇచ్చినప్పటికీ తనకు కాబోయే భర్త ఎవరు అనే విషయాన్ని మాత్రం శిరీష రివీల్‌ చేయలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ప్రీ వెడ్డింగ్‌ సాంగ్‌తో తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 25, 2024 | 03:45 PMLast Updated on: Mar 25, 2024 | 3:45 PM

Barrelakka Shirishas Pre Wedding Was Very Grand

బర్రెలక్క (Barrelakka) శిరీష (Shirisha) ప్రీ వెడ్డింగ్‌ (Pre Wedding) చాలా గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి ఫిక్స్‌ అయ్యిందని క్లారిటీ ఇచ్చినప్పటికీ తనకు కాబోయే భర్త ఎవరు అనే విషయాన్ని మాత్రం శిరీష రివీల్‌ చేయలేదు. ఇప్పుడు ఒక్కసారిగా ప్రీ వెడ్డింగ్‌ సాంగ్‌తో తనకు కాబోయే భర్తను పరిచయం చేసింది. వెంకట్ అనే వ్యక్తితో శిరీష పెళ్లి జరగబోతోంది. వీళ్ల ప్రీ వెడ్డింగ్‌ సాంగ్‌ ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్‌ అవుతోంది. పెళ్లి కోసం ప్రత్యేకంగా సాంగ్‌ కూడా కంపోజ్‌ చేయించుకుంది శిరీష. తన పేరు తన భర్త పేరు కూడా వచ్చేలా పాట చేయించుకుంది. మంచి లోకేషన్స్‌లో సినిమా రేంజ్‌లో ఈ సాంగ్‌ను షూట్‌ చేశారు. ఈ సాంగ్‌తో పాటు శిరీష ఎంగేజ్‌మెంట్‌ను కూడా యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది శిరీష. నిమిషాల్లోనే ఈ వీడియోలు వైరల్‌ అయ్యాయి.

ఒకప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చేసుకుని శిరీష బర్రెలతో వీడియోలు చేసి బర్రెలక్కగా ఫేమస్‌ అయ్యింది. ఆ తరువాత నిరుద్యోగుల సమస్యలపై పోరాడాతానంటూ ఎన్నికల్లో పోటీ చేసింది. కేవలం కొల్లాపూర్‌ నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా శిరీషకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చాలా మంది ప్రముఖుల నుంచి ఆదరణ కూడా లభించింది. కానీ ఆ ఎన్నికల్లో శిరీష ఓడిపోయింది. తరువాత శిరీష పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ.. ఈ ఎన్నికలకు మాత్రం శిరీష దూరంగా ఉంది. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది.

రీసెంట్‌గానే తనకు పెళ్లి ఫిక్స్‌ ఐన వీడియోను యూట్యూబ్‌లో షేర్‌ చేసింది. ఆ వీడియో కూడా బాగా వైరల్‌ అయ్యింది. దీంతో అంతా పెళ్లి కొడుకు ఎవరూ అని అడిగారు. కానీ అప్పుడు శిరీష తనకు కాబోయ భర్తను సీక్రెట్‌గా ఉంచి. ఇప్పుడు ప్రీవెడ్డింగ్‌ సాంగ్‌తో రివీల్ చేసి అందరినీ త్రిల్‌ చేసింది. వీళ్ల జంటను చూసిన బర్రెలక్క ఫాలోవర్స్‌ ఆమెకు కంగ్రాట్స్‌ చెప్తున్నారు. ఇద్దరి జంట చాలా బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు. పెళ్లి అయ్యాక కూడా ప్రజా సమస్యలపై పోరాడాలని శిరీషకు చెప్తున్నారు. పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న సందర్భంగా డయల్‌ న్యూస్‌ తరపు నుంచి కూడా శిరీషకు కంగ్రాట్స్‌.