ఆసీస్ లో బ్యాటర్ల ఫ్లాప్ షో, మళ్ళీ ఓడిన భారత్ ఏ

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్ యువ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనాధికారిక టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2024 | 06:52 PMLast Updated on: Nov 09, 2024 | 6:52 PM

Batters Flop Show In Aussies India A Lost Again

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్ యువ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన రెండో అనాధికారిక టెస్టులో 6 వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైంది. దీంతో రెండు మ్యాచ్‌ల​ టెస్టు సిరీస్‌ను ఆసీస్ ఏ 2-0 తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ లోనూ బౌలర్లు అదరగొట్టినా మన బ్యాటర్లు చేతులెత్తేశారు. ఫలితంగా 168 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ యువ జట్టు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 229 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ బ్యాటర్ ధృవ్ జురెల్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జురెల్ 5 ఫోర్లతో 68 పరుగులు చేశాడు. తనీష్ కొటియన్‌ 44, నితీష్ కుమార్ రెడ్డి 38 పరుగులతో రాణించారు. దీంతో ఓ మోస్తారు టార్గెట్ ను ఆసీస్ ముందు ఉంచగలిగింది.