ఇంపాక్ట్ తోనే ఇంపాక్ట్ కొనసాగించేందుకే బీసీసీఐ మొగ్గు
ఐపీఎల్ మెగా వేలానికి ముందు కొన్ని నిబంధనలపై బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ లో ఇంపాక్ట్ రూల్ కొనసాగిస్తారా లేదా అన్న దానిపై క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రూల్ ను కొన్ని ఫ్రాంచైజీలు వ్యతిరేకిస్తుండగా... మరికొన్ని సమర్థిస్తున్నాయి.
ఐపీఎల్ మెగా వేలానికి ముందు కొన్ని నిబంధనలపై బీసీసీఐ సమాలోచనలు చేస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్ లో ఇంపాక్ట్ రూల్ కొనసాగిస్తారా లేదా అన్న దానిపై క్రికెట్ ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఈ రూల్ ను కొన్ని ఫ్రాంచైజీలు వ్యతిరేకిస్తుండగా… మరికొన్ని సమర్థిస్తున్నాయి. పలువురు ఆటగాళ్ళ కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇంపాక్ట్ రూల్ తో ఆల్ రౌండర్లకు అన్యాయం జరుగుతుందన్న వాదనను తెరపైకి తెచ్చారు. దీనిపైనా కూడా బీసీసీఐ వర్గాలు చర్చించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్, డివీలియర్స్ లాంటి ఆటగాళ్ళు ఇంపాక్ట్ రూల్ కు మద్ధతు తెలిపారు. ఈ రూల్ అంత చెడ్డదేం కాదని అశ్విన్ వ్యాఖ్యానించాడు. మన వ్యూహాలకు ఇది అదనపు విలువతోపాటు పదును పెట్టేలా చేస్తుందన్నాడు.
మరోవైపు కొన్ని ఫ్రాంచైజీలు కూడా ఇంపాక్ట్ రూల్ ను సమర్థించాయి. రూల్ కొనసాగిస్తే అదనంగా మరో ఆటగాడిని ఆడించొచ్చన్న వాదనతో ఏకీభవించాయి. దీనితో పాటు మ్యాచ్ చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగేందుకు వీలుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. గత సీజన్ లో జరిగిన కొన్ని మ్యాచ్ లను కూడా ఉదాహరణగా పేర్కొన్నాయి. గత నెలరోజులుగా దీనిపై సుధీర్ఘ చర్చలు జరిపిన బీసీసీఐ చివరికి ఇంపాక్ట్ రూల్ ను కొనసాగించేందుకు నిర్ణయించినట్టు సమాచారం. వచ్చే వారం తర్వాత దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.