Test Cricket: ఇక టెస్ట్ మ్యాచ్‌కు రూ.45 లక్షలు.. ఆటగాళ్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్
ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్‌కు 15 లక్షలు ఇస్తుండగా ఇకపై రూ.45 లక్షలు అందజేయనుంది. అయితే దీనికి కొన్ని కండిషన్స్ పెట్టింది. దీని ప్రకారం.. ఏడాది కాలంలో ఓ ఆటగాడు 75 శాతం కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆడితే ప్రతీ మ్యాచ్‌కు 45 లక్షల చొప్పున అధిక వేతనాన్ని అందిస్తుంది.

Test Cricket: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న భారత ఆటగాళ్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ఇచ్చింది. టెస్ట్ క్రికెట్ ఆడే ఆటగాళ్లకు భారీ నజరానా ప్రకటించింది. మ్యాచ్ ఫీజు ఏకంగా మూడు రెట్లు పెంచింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జై షా.. ఆటగాళ్ల ఇన్సెంటివ్ వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రస్తుతం టెస్ట్ మ్యాచ్‌కు 15 లక్షలు ఇస్తుండగా ఇకపై రూ.45 లక్షలు అందజేయనుంది. అయితే దీనికి కొన్ని కండిషన్స్ పెట్టింది.
IND VS ENG: ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం..
దీని ప్రకారం.. ఏడాది కాలంలో ఓ ఆటగాడు 75 శాతం కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆడితే ప్రతీ మ్యాచ్‌కు 45 లక్షల చొప్పున అధిక వేతనాన్ని అందిస్తుంది. సగం కంటే ఎక్కువ టెస్ట్‌లు ఆడితే ప్రతి మ్యాచ్‌కు 30 లక్షల చొప్పున ఇన్సెంటివ్‌గా అందుకోనున్నారు. అలాగే తుది జట్టులో ఆడని ఆటగాళ్లు 50 శాతం ఎక్కువ మ్యాచ్‌ల్లో జట్టుతో ఉంటే ఒక్కో టెస్ట్‌కు రూ.15 లక్షలు.. 75 శాతం కంటే ఎక్కువ మ్యాచ్‌ల్లో బెంచ్‌కు పరిమితమైతే రూ.22.5 లక్షలు అందుకోనున్నారు. సగం కంటే తక్కువ మ్యాచ్‌లు ఆడితే మాత్రం ఈ ఇన్సెంటివ్ రాదు. టెస్ట్ క్రికెట్‌కు కుర్రాళ్లు ప్రాధాన్యం ఇచ్చేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జై షా తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒక సీజన్‌లో భారత్ 9 టెస్ట్‌లోఆడితే.. అందులో 5 లేదా 6 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు ప్రతీ మ్యాచ్‌కు రూ.30 లక్షల చొప్పున, 7 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లకు రూ.45 లక్షల చొప్పున ఇన్సెంటివ్ రూపంలో అందుతుంది.
4 మ్యాచ్‌లు ఆడినా.. ఈ ఇన్సెంటివ్ లభించదు. కొత్త స్కీమ్ 2022-23 సీజన్ నుంచి అమలులోకి రానుంది. ఈ స్కీమ్‌ను అమలు చేసేందుకు బీసీసీఐ ఒక్కో సీజన్‌కు అదనంగా రూ.40 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం బీసీసీఐ.. టెస్టు మ్యాచ్‌లు ఆడినందుకు గాను ఒక్కో ఆటగాడికి రూ. 15 లక్షలు, వన్డేలు ఆడితే రూ. 6 లక్షలు, టీ20లకు రూ. 3 లక్షలు చెల్లిస్తోంది. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా గుర్తింపు తెచ్చుకుంది.