Nail Polish Remover : నెయిల్ పాలిష్ రిమూవర్ తో జాగ్రత.. లేదంటే ప్రాణాలకే ముప్పు..

నెయిల్ పాలిష్ అంటేనే తీరొక్క రంగు రంగులతో ఉండే ద్రవ పదార్థం.. ఏ నెయిల్ పాలిష్ వేళ్ల గోర్లకు ఎంత సులువుగా వేసకుంటాంమో.. అంతే సులువుగా తొలగించుకోవచ్చు. దీనికోసం నెయిల్ పాలిష్ రిమూవర్ అనే ఓ లిక్విడ్ దోరుకుంది. దాని ద్వారా గోర్లకు ఉన్న పాత నెయిల్ పాలిష్ ఆ ద్రవంతో తొలగించుకోవచ్చు.. అయితే ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ టైం లో సరైన పద్ధతులు పాటించకపోతే.. ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది మరి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 2, 2024 | 09:21 AMLast Updated on: Feb 02, 2024 | 9:21 AM

Be Careful With Nail Polish Remover Or Life Will Be Threatened

 

 

నెయిల్ పాలిష్ బహుశా ఈ పదం వినని వారు అంటూ ఉండరు.. ఆడవారికి అయితే పెద్దగా పరిచయం అక్కలేని పదం.. ఎక్కువగా ఆడవారు వారి గోరు పలకను అలంకరించడానికి ఈ నెయిల్ పాలిష్ ను వాడుతుంటారు. పండుగల లో.. ఫ్యాక్షన్ లో.. పెళ్లిళ్లకు.. బర్త్ డే సందర్భంగా నో.. ఇలా చాలా సందర్భాల్లో నెయిల్ పాలిష్ ను వాడుతుంటారు. ఎప్పుడైనా ఈ నెయిల్ పాలిష్ నుంచి మనకు ప్రమాదం పొంచి ఉంది అని.. కానీసం విన్నారా.. అయితే ఇది మీకోసంమే చదవండి.

నెయిల్ పాలిష్ అంటేనే తీరొక్క రంగు రంగులతో ఉండే ద్రవ పదార్థం.. ఏ నెయిల్ పాలిష్ వేళ్ల గోర్లకు ఎంత సులువుగా వేసకుంటాంమో.. అంతే సులువుగా తొలగించుకోవచ్చు. దీనికోసం నెయిల్ పాలిష్ రిమూవర్ అనే ఓ లిక్విడ్ దోరుకుంది. దాని ద్వారా గోర్లకు ఉన్న పాత నెయిల్ పాలిష్ ఆ ద్రవంతో తొలగించుకోవచ్చు.. అయితే ఈ నెయిల్ పాలిష్ రిమూవర్ టైం లో సరైన పద్ధతులు పాటించకపోతే.. ప్రాణాలకే ప్రమాదం పొంచి ఉంటుంది మరి.

తాజాగా ఇలాంటి చేదు అనుభవం ఓ చిన్నారికి ఎదురయ్యింది. అమెరికా (America)లోని ఓహియోకు (Ohio)చెందిన 14 ఏళ్ల కెన్నడి (Kennedy) అనే బాలిక తన పాత నెయిల్ పాలిష్ ను రిమూవ్ చేసుకుంటుంది. ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ (Nail Polish remover) ను ఉపయోగిస్తున్న సమయంలో పక్కనే ఒ కొవ్వొత్తి ఉంది. తన మంచానికి దగ్గరలో కొవ్వొత్తి ఉన్నా ఆ చిన్నారి ఏమీ కాదనుకుంది తన పాని తాను చేసుకుంటు పోయింది. ఇక్కడే అసలు కథ ప్రమాదం మొదలైంది. నెయిల్ పాలిష్ రిమూవర్ ఆవిరికి దగ్గరలో కొవ్వొత్తి ఉండటంతో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ బాలిక మంటల భయానికి తన చేతిలో ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్ బాటిల్ను వదిలేసింది పరుగులు తీసింది. ఇక ఆ నెయిల్ పాలిష్ రిమూవర్ పగలడంతో మంటలు మరింత పెద్దన్న ఎగసిపడ్డాయి.

ఈ ప్రమాదంలో అక్కడ ఉన్న వస్తువులన్నింటికీ మంటలు అంటుకున్నాయి. హఠాత్పరిణామంతో చిన్నారి గట్టిగా కేకలు పెట్టింది. కెన్నడి అరుపులతో అలర్టయిన తల్లిదండ్రులు వెంటనే ఆమె బెడ్రూమ్కి వెళ్లారు. తీర అక్కడ చూస్తే గది అంతా పొగలు కమ్ముకున్నాయి చిన్నారేమో మంటల్లో చిక్కుకుని ఉంది. వారు కెన్నడీని చుట్టుముట్టిన మంటలను ఆర్పేశారు. ఆ చిన్నారికి తీవ్ర గాయాలవ్వడంతో.. హుటాహుటిన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ పాప చర్మం చాలా వరకు కాలిపోయింది. బాలిక రెండు తొడలు, పొత్తి కడుపు, కుడి చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయా భాగాలకు ఎక్సిషన్ అనే శస్త్రచికిత్స చేశారు డాక్టర్లు ప్రస్తుతం ఆమె చేతులు కొంతవరకు నయం అయ్యాయి మిగతా శరీర భాగాలకు అయిన గాయాలు తగ్గడానికి కొంత సమయం పడుతుంది. కొత్త చర్మం రావడానికి కనీసం ఏడాదైనా పడుతుందని డాక్టర్లు చెప్పారు. అమెరిలో జరిగిన ఈ సంఘటన చాలామందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక్కసారిగా అక్కడ పరిసర ప్రాంతా వసులను ఉల్లికి పడేలా చేసింది.