India’s alliance : ఇండియా కూటమికి బీటలు.. ?

లోక్‌సభ ఎన్నికలకు ముందే.. ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్‌కు కష్టాల్ని తెచ్చిపెట్టినట్టు అర్థమవుతోంది. రిజల్ట్స్ వచ్చిన సాయంత్రమే.. ఇలాగైతే ఇండియా కూటమి కష్టమే అన్నట్టుగా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇక ఈనెల 6న జరిగే కూటమి సమావేశానికి రాకపోవడానికి మమతా బెనర్జీ చెప్పిన రీజనేంటి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2023 | 01:01 PMLast Updated on: Dec 05, 2023 | 1:01 PM

Beats For Indias Alliance

లోక్‌సభ ఎన్నికలకు ముందే.. ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్‌కు కష్టాల్ని తెచ్చిపెట్టినట్టు అర్థమవుతోంది. రిజల్ట్స్ వచ్చిన సాయంత్రమే.. ఇలాగైతే ఇండియా కూటమి కష్టమే అన్నట్టుగా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ఇక ఈనెల 6న జరిగే కూటమి సమావేశానికి రాకపోవడానికి మమతా బెనర్జీ చెప్పిన రీజనేంటి.

బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఏర్పడిన విపక్షాల ఇండియా కూటమిలో లుకలుకలు కనిపిస్తున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత.. కూటమి సమావేశానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ నెల 6న భేటీ కావాలని నిర్ణయించింది. గతంలో ముంబై, బెంగళూరులో మీటింగ్‌ నిర్వహించిన ఇండియా కూటమి.. ఈసారి సీట్ల సర్దుబాటు అంశంపై చర్చించాలని భావించింది. ఈనెల 6న జరిగే సమావేశానికి హాజరు కావాలంటూ కూటమిలోని పార్టీలకు ఖర్గే సమాచారమిచ్చారు. అయితే.. ఇదే విషయంపై రెస్పాండ్ అయ్యారు బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ.. మీటింగ్ గురించి అసలు తనకు తెలియదనీ.. షెడ్యూల్‌ ప్రకారం బెంగాల్‌లో జరిగే కార్యక్రమాలకే వెళ్తానంటూ బాంబ్ పేల్చారు.

MIM లెక్క ఎందుకు తప్పింది?

వాస్తవంగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణ మినహా.. మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ ఫలితాలపై హస్తం పార్టీ రివ్యూ చేసుకుంటోంది. అంతే కాకుండా.. ఫలితాలు వచ్చాక సమావేశం పెట్టాలని గతంలోనే కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్‌పై విపక్ష కూటమి నేతలు కాస్త గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా.. సీట్ల సర్దుబాటు ఉండాలని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కూటమిలో సఖ్యత లేదని తేలిందంటున్నారు విశ్లేషకులు. ఇండియా కూటమి ఓట్లు చీలడం వల్లే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ఓడిపోయిందన్నారు మమతా బెనర్జీ.
బీజేపీని ఎదుర్కోవాలంటే కలసికట్టుగా ముందుకు సాగాలనీ.. మధ్యప్రదేశ్‌లో సీట్ల సర్దుబాటుకు పిలిచినా కాంగ్రెస్ స్పందించలేదంటూ ఇటీవలే సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేష్ విమర్శలు చేశారు.

మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఇండియా కూటమిలో అభిప్రాయభేదాలు స్పష్టంగా బయటపడ్డాయని విశ్లేషకులు చెప్పేమాట. ఎందుకంటే.. సమాజ్‌వాదీ పార్టీ , జేడీయూ కూడా ఎన్నికల బరిలో ఉండటంతో ఓట్లు చీలి బీజేపీకి లాభం చేకూరింది. ఇప్పుడు కూటమి సమావేశం ఏర్పాటు చేస్తే.. తనకు సమాచారం లేదంటూ దీదీ చెప్పడంతో ఇండియా అలయన్స్‌లో లుకలుకలున్నాయనేది అర్థమవుతోంది. ఏదేమైనా.. ఈనెల 6న జరిగే సమావేశానికి మమత వెళ్తారా లేదా అన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే ఉంది. అంతేకాకుండా.. దీదీ బాటలోనే ఇంకా కొన్ని పార్టీల నేతలు కూడా నడుస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.