బాలయ్య షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరగడం ఇప్పుడు కలకలం రేగుతుంది. ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్లో బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేశారు ఆహా మేనేజ్మెంట్.

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరగడం ఇప్పుడు కలకలం రేగుతుంది. ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్లో బెట్టింగ్ యాప్ ను ప్రమోషన్ చేశారు ఆహా మేనేజ్మెంట్. అన్ స్టాపబుల్ లో వచ్చిన ఆ యాప్ ని చూసి తాను బెట్టింగ్ వేసి డబ్బు కోల్పోయాను అంటూ ఓ బాధితుడు మీడియా ముందుకు వచ్చాడు.
ఆ బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు 80 లక్షలు పోగొట్టుకున్నట్టు బాధితుడు వాపోతున్నాడు. బాలకృష్ణ షోలో వచ్చిన కారణంగానే ఆ యాప్ ను తాను నమ్మి బెట్టింగ్ వేసాను అంటూ చెప్తున్నాడు బాధితుడు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై ఆ యాప్ ను ప్రమోట్ చేసిన ఆహా పై చర్యలు తీసుకోవాలంటూ వాపోతున్నాడు. గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ భరతం పడుతున్నారు పోలీసులు. ఇప్పటికే పలువురు ఇన్ఫ్లుయెన్సర్ మీద కేసులు నమోదు చేశారు. ఇప్పుడు బాలయ్య లాంటి సీనియర్ హీరో చేస్తున్న ప్రముఖ షోలో కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరగడం కలకలం రేపుతుంది.