భాయ్ అరెస్ట్ అడుగడుగునా అచ్చం పుష్ప సినిమా లాగే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో కాదు లైఫ్ లో కూడా ఊహించని ట్విస్ట్ పోలీసుల అరెస్ట్. పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపుతున్న బన్నీకి పోలీసులు ఇచ్చింది ఆషామాషీ షాక్ కాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2024 | 07:39 PMLast Updated on: Dec 13, 2024 | 7:39 PM

Bhais Arrest Is Like A Pushpa Movie Every Step Of The Way

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో కాదు లైఫ్ లో కూడా ఊహించని ట్విస్ట్ పోలీసుల అరెస్ట్. పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము రేపుతున్న బన్నీకి పోలీసులు ఇచ్చింది ఆషామాషీ షాక్ కాదు. పుష్ప ది రైజ్ తో వరల్డ్ గా రైజ్ అయిన బన్నీని ఆ సినిమాలో మాదిరే అరెస్ట్ చేసారు. అరెస్ట్ తర్వాత ప్రతీ ఒక్కటి గమనిస్తే పుష్ప సినిమా రియల్ లైఫ్ లో చూసిన ఫీల్ పక్కా. అరెస్ట్ చేస్తుంటే శ్రీవల్లికి “బిన్నే వచ్చేస్తా అమ్మి, ఇది మతిలో పెట్టుకో బంగారం అంటూ” ఓ ముద్దు ఇచ్చినట్టే అనిపించింది స్నేహారెడ్డికి ముద్దు పెట్టినప్పుడు.

నవ్వుతూ… ఈ భాయ్ ని ఎవడూ ఏం పీకలేడు అనే యాటిట్యూడ్ చూపించాడు. పుష్పను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తే… అభిమానులు, సన్నిహితులు అందరూ అక్కడకు వచ్చేశారు. ఈ సీన్ లో కేశవ ఎవరూ అనేది క్లారిటీ లేదు గాని… పుష్ప కోసం ప్రైవేట్ సైన్యం దిగినట్టే అనిపించింది. పుష్పను ఫుల్ సెక్యూరిటీతో పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్తుంటే భాయ్ ఆర్మీ వెనుకే వెళ్ళింది. ఆ సీన్ కూడా పుష్ప సినిమా రేంజ్ లోనే ఉంది. ఇక పోలీస్ స్టేషన్ వద్ద భద్రత చూసి జనాలు షాక్ అయ్యారు. పుష్పను అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్ ను బద్దలు కొడతారేమో అనే భయంతో సెక్యూరిటీ టైట్ చేసారు.

వెంటనే కేటిఆర్ రియాక్ట్ కావడం చూస్తుంటే… పుష్ప సినిమాలో ఎంపీ పుష్ప కోసం నిలబడినట్టే ఫీల్ వచ్చింది. ఇక చిరంజీవి, సినిమా ప్రముఖులు అందరూ షూట్ ఆపేసి పోలీస్ స్టేషన్ కు పరుగులు తీయడం కూడా పుష్ప సినిమా రియల్ లైఫ్ లో ఎక్ష్పీరియన్సు చేసినట్టే. పుష్పను ఎలా అయినా బయటకు రానీయకూడదన్న ఉద్దేశంతోనే పోలీసులు పెట్టిన సెక్షన్ లు చూస్తుంటే… పుష్ప గాడు అంటే ఏ రేంజ్ భయమో అర్ధమవుతోంది అంటూ భాయ్ ఆర్మీ కాలర్ ఎగరేస్తుంది. అల్లు అర్జున్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు.

105, 118(1), రెడ్‌ విత్‌ 3/5 BNS సెక్షన్ల కింద కేసు.. 105 సెక్షన్‌ నాన్‌బెయిలబుల్ కేసు.. 5 నుంచి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం.. BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని టాక్. ఈ కేసుల దెబ్బకు వెంటనే భాయ్ లాయర్ నిరంజన్ రెడ్డి హైకోర్ట్ లో ఎమర్జెన్సీ పిటీషన్ వేసారు. అత్యవసరంగా తమ పిటీషన్ విచారించాలి అంటూ హైకోర్ట్ ను కోరారు. భాయ్ ను అరెస్ట్ చేయడంతో భారీగా అభిమానులు పోలీస్ స్టేషన్ కు వచ్చేశారు. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ రియాక్ట్ అవుతున్నారు. విడుదల చేయండి అంటూ డిమాండ్ లు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే అచ్చం పుష్ప సినిమా లైవ్ ఫీల్ తో గూస్ బంప్స్ వస్తున్నాయి.