Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భానుడి భాదుడు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యని ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంటి నుంచి కలు బయటపెట్టాలంటే జంకుతున్నారు ప్రజలు. రాష్ట్రాంలో రోజు 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు మండుటెన్నల్లో బయటకు వెళ్లాలంటే.. భయపడుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యని ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంటి నుంచి కలు బయటపెట్టాలంటే జంకుతున్నారు ప్రజలు. రాష్ట్రాంలో రోజు 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు మండుటెన్నల్లో బయటకు వెళ్లాలంటే.. భయపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న 16 జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 102 మండలాల్లో వడగాడ్పులు వీచాయి. మూడు జిల్లాలో 45 డిగ్రీల కు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదైనయి. రేపు 56 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 174 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఎండ తీవ్రత కొనసాగుతుందని.. ఎల్లుండి 64 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 170 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇవాళ నంద్యాల(D) నందవరంలో 45.6 డిగ్రీలు, విజయనగరం(D) రాజాంలో 45.5 డిగ్రీలు, అల్లూరి(D) కొండైగూడెంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొన్నారు. కాగా రానున్న మరో ముడు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఇక తెలంగాణలో సైతం ఇవే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్, రామగుండం, భద్రచాలం, జిల్లాలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ ఎండలకు గృహణి మహిళలకు డాక్టర్లు కొన్ని సూచణలు చేశాయి. గర్భిణీలు.. వృద్ధులు.. చిన్న పిల్లలు అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నయాని డాక్టర్లు చూసించారు.